Asianet News TeluguAsianet News Telugu

పెరిగిన సీఎన్ జీ, పీఎన్ జీ ధరలు.. సామాన్యుడి నెత్తిన మరో పిడుగు...

కొత్త రేట్లు అక్టోబర్ 13 ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని ఐజిఎల్ మంగళవారం తెలిపింది. ఈ ధరల పెరుగుదల తరువాత, ఢిల్లీలో CNG ధరలు ఇప్పుడు కిలోకు రూ. 49.76 వద్ద నిలిచి ఉండగా, PNG స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ (SCM) కి రూ. 35.11 కి విక్రయించబడుతుందని గ్యాస్ పంపిణీ సంస్థ తెలిపింది.

Piped Cooking Gas Prices, CNG Rates Hiked In Delhi, Other Cities
Author
Hyderabad, First Published Oct 13, 2021, 9:45 AM IST

న్యూఢిల్లీ : ఢిల్లీ, పొరుగున ఉన్న నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఇతర నగరాల్లో కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (CNG), పైప్డ్ నాచురల్ గ్యాస్(PNG) ధరలను పెంచుతున్నట్లు ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) ప్రకటించింది. 

కొత్త రేట్లు అక్టోబర్ 13 ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని ఐజిఎల్ మంగళవారం తెలిపింది. ఈ ధరల పెరుగుదల తరువాత, ఢిల్లీలో CNG ధరలు ఇప్పుడు కిలోకు రూ. 49.76 వద్ద నిలిచి ఉండగా, PNG స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ (SCM) కి రూ. 35.11 కి విక్రయించబడుతుందని గ్యాస్ పంపిణీ సంస్థ తెలిపింది.

PNG ధర ఇప్పుడు నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లో SCM కి రూ. 34.86 గా ఉంటుందని IGL పేర్కొంది. అదేవిధంగా, CNG కిలోకు రూ. 56.02 కి విక్రయించబడుతుందని స్పష్టం చేసింది.

వివిధ ఇతర నగరాల్లో కొత్త రేట్లు ఇలా ఉన్నాయి : 

- గురుగ్రామ్‌లో CNG ధర కిలోకు రూ, 58.20కాగా, PNG ధర SCM కి రూ. 33.31కి దొరుకుతుంది.

-రేవరీలో  సిఎన్‌జి కిలోకు రూ. 58.90,  కర్నాల్, కైతాల్‌లో కిలోకు రూ. 57.10 కి అమ్ముతున్నారు. ఇక రేవారి, కర్నాల్‌లో పీఎన్ జీ ధర ఎస్ సీఎమ్ కి. రూ. 33.92గా ఉంది.

- ముజఫర్‌నగర్, మీరట్, షామ్లీలలో సీఎన్ జీ ధర కిలోకు రూ. 63.28కాగా, పీఎన్ జీ ధర ఎస్ సీఎమ్ కి. రూ. 38.37 కి విక్రయించబడుతుంది.

- కాన్పూర్, ఫతేపూర్, హమీర్‌పూర్‌లో కిలో సీఎన్ జీ రూ. 66.54 కి విక్రయించబడుతుంది.

- అజ్మీర్, పాలి, రాజ్‌సమంద్‌లో సీఎన్ జీ ధర కిలోకు రూ. 65.02.

ఇక పైప్డ్ గ్యాస్ కోసం, IGL ఓ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది, "IGL కనెక్ట్ మొబైల్ యాప్ ద్వారా సెల్ఫ్-బిల్లింగ్ను ఉపయోగించుకోవడానికి రూ. 15 ప్రోత్సాహకం కూడా అందుబాటులో ఉంది." అని తెలిపింది. 

ఈ పెంపు నెలలో ఇది రెండవసారి. సీఎన్ జీ, పీఎన్ జీ రేట్లు వరుసగా కిలోకు రూ. 2.28, రూ 2.10  పెంపుతో అక్టోబర్ 1 న ఈ సహజవాయువు ధరలు 62% పెంచారు.

ఇదిలా ఉండగా, ఈ నెల ఆరున వంట గ్యాస్ gas cylinders price బుధవారం రూ.15 పెరిగింది. ఢిల్లీలో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.899.50కి చేరింది. 

సామాన్యుడికి షాక్.. గ్యాస్ సిలిండర్ల ధర మళ్ళీ పెంపు.. నేటి నుంచి అమల్లోకి..

కాగా సెప్టెంబర్ నెలలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.25 పెరిగింది. ఈ నెలలో 19కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.43 పెరగడం సామాన్యులకు పెను భారంగా మారింది. ఇక తాజాగా పెరిగిన వంట గ్యాస్ ధరతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తం గ్యాస్ ధర రూ.190 పెంచినట్లైంది. 

కాగా, అంతకుముందు ఐదు రోజుల క్రితమే 19కిలోల సిలిండర్ ధర అక్టోబర్ 1 నుండి ఢిల్లీలో రూ .1693 నుండి రూ .1736.50 కి పెరిగింది. కోల్‌కతాలో దీని ధర రూ .1805.50కు, ముంబైలో రూ .1685కు, చెన్నైలో రూ. 1867.50కి పెరిగింది. గత నెల సెప్టెంబరులో  రూ .75 మేర పెరిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 884.5. కోల్‌కతాలో దీని ధర రూ .911. ముంబైలో కోసం రూ. 884.5, చెన్నైలో రూ. 900.5 గా ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios