ఒడిశా బాలాసోర్‌లో డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (DRDO) పినాకా ఎక్స్‌టెండెడ్ రేంజ్ రాకెట్ ట్రయల్స్‌ను విజయవంతంగా పరీక్షించింది. 

స్వదేశీ సాంకేతిక ప‌రిజాన్ఞంతో రూపొందించిన పినాక రాకెట్ సామర్థ్యాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నిరంతరం అభివృద్ది చేస్తుంది. గత కొన్ని వారాలుగా బాలాసోర్, పోఖ్రాన్‌లలో పినాక రాకెట్స్ సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది. 

తాజాగా ఒడిశా బాలాసోర్‌లో డీఆర్డీవో పినాక రాకెట్‌ ట్రయల్స్‌ నిర్వహించింది. రాకెట్‌ను సోమవారం డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. దేశ రక్షణలో కొత్త ఆయుధాల తయారీలో నిమగ్నమైన డీఆర్డీవో పినాక రాకెట్ సామ‌ర్థ్యాన్ని పెంచాల‌ని ఇటీవల గత కొద్ది రోజులుగా బాలాసోర్‌తో పాటు రాజస్థాన్‌లోని ఫోఖ్రాన్‌లో డీఆర్డీవో యూజర్ ట్రయల్స్ చేపట్టగా.. విజయవంతమయ్యాయి.

రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా విజయంలో మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్, ఎకనామిక్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్‌తో సహా ఇతర తయారీదారులు ఈ పరీక్షను విజ‌యవంతం చేయడంలో, పినాక సామర్థ్యాలను పెంచడంలో అపారమైన సహకారం అందిస్తున్నాయి. 

పినాక రాకెట్ వ్యవస్థ గురించి తెలుసుకుందాం.. 

పినాక మార్క్-1 (Pinaka Mk-i) అనేది అప్‌గ్రేడ్ చేయబడిన రాకెట్ సిస్టమ్. ఇది గతంలో అనేకసార్లు విజయవంతంగా ప్రయోగించబడింది. ఈ రాకెట్ వ్యవస్థను DRDO పూర్తిగా స్వదేశీ సాంకేతికత ఆధారంగా అభివృద్ధి చేసింది. పినాక మార్క్-1 రాకెట్ వ్యవస్థ దాదాపు 45 కి.మీ. అదే సమయంలో పినాకా-II రాకెట్ వ్యవస్థ 60 కి.మీ. దూరంలో ఉన్న శ‌త్రు స్థావ‌రాల‌ను టార్గెట్ చేస్తుంది. రాకెట్ వ్యవస్థ ప్రయోగశాలను ఆర్డినెన్స్ హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (HEMRL), రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ARDE) సంయుక్తంగా రూపొందిస్తాయి. 

1980లలో అభివృద్ధి 

 DRDO పినాక రాకెట్ వ్యవస్థను 80ద‌శ‌కంలో అభివృద్ధి చేయడం ప్రారంభించింది. పినాక రాకెట్ వ్య‌వ‌స్థతో శత్రు లక్ష్యాలను నాశనం చేయవచ్చు. ఇది స్వల్ప శ్రేణి పదాతిదళం, ఫిరంగిదళం, ఆయుధ వాహనాలను లక్ష్యంగా చేసుకుంటుంది. 1990ల చివరలో పినాక మార్క్-1 ఇండియ‌న్ ఆర్మీ అమ్ముల పొద‌ల చేరింది. ఆ త‌రువాత‌ పినాకా-IIని గైడెడ్ మిస్సైల్‌గా రూపొందించారు.

కార్గిల్ యుద్ధంలో పినాక మార్క్-1 స్పెష‌ల్ మార్క్

పినాక మార్క్-1 (Pinaka Mark-I) వేరియంట్‌ను 1999 కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం ఉపయోగించింది, ఇది పర్వత స్థావరాలపై ఉన్న‌ పాకిస్తాన్ శ‌త్రు స్థావ‌రాల‌ను విజ‌యవంతంగా నాశ‌నం చేసింది.