కెనాల్ లో వ్యాను బోల్తా పడి 15మంది గల్లంతైన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో చోటుచేసుకుంది.  ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్ ఇందిరా కెనాల్‌లో పడిపోయింది. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న సుమారు 15 నీటిలో గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

ఈ ఘటన పట్వాఖండా గ్రామం నాగ్‌రాం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పెండ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.