Merits Of Dowry: నర్సింగ్ విద్యార్థులకు వరకట్నం వల్ల ప్రయోజనాలు అనే ఆంశాన్ని పాఠ్యాంశంగా బోధించడంపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర ఆహగ్రం వ్యక్తం చేసింది. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ సిలబస్ నిబంధనల మేరకే రచించినట్లు రచయిత్రి TK ఇంద్రాణి తెలిపారు. ఈ పాఠ్యాంశాన్ని తొలగించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కు లేఖ రాశారు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది.
Merits Of Dowry: ఒకప్పుడు కన్యాశుల్కం.. ఇప్పుడు వరకట్నం..ఈ రెండు సమస్యలో బాధితులు ఆడవారే. శాస్త్ర సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా.. సమాజంలో మగవాళ్లతో సమానంగా ఆడవారు అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. ఇంకా ఎదోక చోట.. దురాచారాలు కొనసాగుతునే ఉన్నాయి. అందులో వరకట్నం అనేది మహిళలకు పెను శాపంగా మారుతోంది. వరకట్నానికి మహిళలు బలవుతూనే ఉన్నారు. అలాంటి వరకట్నానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించాల్సింది పోయి.. కట్నంతో ప్రయోజనాలు ఉన్నాయంటూ పాఠ్యాంశంగా కళాశాల విద్యార్థులకు బోధించడం గమనార్హం.
బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నర్సింగ్ విద్యార్థుల #టెక్స్ట్‌బుక్ ఆఫ్ సోషియాలజీ ఫర్ నర్స్ అనే సోషియాలజీ పుస్తకంలో 'వరకట్నం వల్ల ప్రయోజనాలు' పేరుతో ఓ పాఠ్యాంశం ఉంది. ఈ పుస్తకాన్ని టీకే ఇంద్రాణీ అనే రచయిత్రి రచించింది. ఈ పాఠ్యంశంపై ఆ రచయిత్రిని వివరణ అడ్డగా... ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ సిలబస్ నిబంధనల మేరకు ఆ పుస్తకాన్ని రచించినట్లు వివరణ ఇచ్చారు.
ఈ పాఠ్యాంశంలో వరకట్నం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయాన్ని వివరించారు. ఆనాదిగా.. అబ్బాయిల తల్లిదండ్రులు వరకట్నం తీసుకుంటాన్నారనీ, ఇందుకు ప్రధాన కారణం.. వారు వారి కుమార్తెలు, అక్కాచెల్లెళ్లకు కట్నం ఇచ్చి పెళ్లి చేయడమేననీ, అయితే ఈ వరకట్న వ్యవస్థ వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయని, కట్నం ఇవ్వడం వల్ల నూతన దంపతుల కొత్త కాపురాన్ని ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవనీ, ఆడపిల్లలు తమ పుట్టింటి ఆస్తిలో వాటాను ఇలా కట్నం రూపంలో పొందుతారని వివరించారు.
అలాగే.. పరోక్షంగా వరకట్నం వల్లే ఆడపిల్లలను చదివించడం పెరిగిందనీ, అమ్మాయి చదువుకుని, ఉద్యోగం చేస్తే కట్నం ఇవ్వడం కాస్త తగ్గుతోందని, అలాగే.. కాస్త అందం తక్కువగా ఉన్న అమ్మాయిలకు కూడా పెళ్లిళ్లు కట్నం వల్ల జరుగుతున్నాయని ఆ పుస్తకంలో రాసి ఉంది. ప్రస్తుతం ఈ పాఠ్యాంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది దీన్ని ట్విటర్‌లో పోస్ట్ చేసి విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి అవమానకరమైన, సమస్యాత్మక పుస్తకాలను బోధించడం సిగ్గు చేటని, వరకట్నం గొప్పతనాన్ని వివరించే పాఠ్యాంశాలు పాఠ్యపుస్తకాల్లో ఉండటం.. దేశానికి, రాజ్యాంగానికి అవమానమని పేర్కొన్నారు.
వరకట్నం అనేది నేరపూరితమైన చర్య అయినప్పటికీ, మనలో పాత కాలం చెల్లిన ఆలోచనలు ప్రబలంగా ఉండటం చాలా దురదృష్టకరమనీ, విద్యార్థులు ఇటువంటి తిరోగమన కంటెంట్‌కు గురికావడం మరింత ఆందోళన కలిగిస్తుందనీ, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇటువంటి పాఠ్యపుస్తకాల సర్క్యులేషన్‌ను తక్షణమే నిలిపివేయాలని, ఆ పాఠ్యాంశాన్ని పుస్తకాన్ని తీసివేయాలని, భవిష్యత్తులో ఇటువంటి మహిళా వ్యతిరేక కంటెంట్‌ను బోధించకుండా లేదా ప్రోత్సహించకుండా ఉండేలా కఠినమైన చర్యలు తీసుకోవాలని అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కోరారు.
