గత కొన్ని సంవత్సరాలుగా సెల్ఫీ మానవ జీవితంలో ఓ భాగమైపోయిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సందర్భాన్ని బట్టి ఫోటోలు దిగడం.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం.

కాగా.. స్మార్ట్ ఫోన్ లేని నలుగురు చిన్నారులు.. ఒక చెప్పుతో సెల్ఫీ దిగుతూ సంబరపడిపోయారు. వాళ్లు అలా చెప్పుతో సెల్ఫీ దిగుతున్నట్లు  ఫోజు ఇవ్వగా,.. వారిని ఓ ఔత్సాహికుడు ఫోటో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా.. ఆ ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.  ఎంతలా అంటే.. ఈ ఫోటోపై సెలబ్రెటీలు సైతం స్పందిస్తున్నారు.

ఆ ఫోటోల చిన్నారుల అమాయకత్వం చాలా మందిని ఇట్టే కట్టిపడేసింది. ఉన్నదాంతోనే సంతృప్తి పడుతున్నారని.. సంతోషానికి అసలు సిసలైన చిరునామా ఈ చిన్నారులు అంటూ నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.