Jaipur: పీఎఫ్ఐ తో లింకుల‌కు సంబంధించి రాజ‌స్థాన్ లోని ఏడు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు చేసింది. కోటాలో మూడు చోట్ల, సవాయ్ మాధోపూర్, భిల్వారా, బుందీ, జైపూర్ లలో ఒక్కొక్కటి చొప్పున పీఎఫ్ఐ తో సంబంధాలు క‌లిగివున్నార‌నే ప‌లువురు అనుమానితుల నివాస, వాణిజ్య సముదాయాలపై ఎన్ఐఏ దాడులు చేసింది. 

NIA raids 7 locations linked to PFI in Rajasthan: నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకలాపాలకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాడులు కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే శనివారం రాజస్థాన్ లోని ఏడు ప్రాంతాల్లో ఏన్ఐఏ సోదాలు నిర్వహించింది.

వివ‌రాల్లోకెళ్తే.. పీఎఫ్ఐ తో లింకుల‌కు సంబంధించి రాజ‌స్థాన్ లోని ఏడు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు చేసింది. కోటాలో మూడు చోట్ల, సవాయ్ మాధోపూర్, భిల్వారా, బుందీ, జైపూర్ లలో ఒక్కొక్కటి చొప్పున పీఎఫ్ఐ తో సంబంధాలు క‌లిగివున్నార‌నే ప‌లువురు అనుమానితుల నివాస, వాణిజ్య సముదాయాలపై ఎన్ఐఏ దాడులు చేసింది. రాజస్థాన్ లోని బరన్ జిల్లాకు చెందిన సాధిక్ సర్రాఫ్, కోటాకు చెందిన మహ్మద్ ఆసిఫ్ లు పీఎఫ్ఐ అధికారులు, సభ్యులు, కార్యకర్తలతో కలిసి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఈ కేసు నమోదైందని ఎన్ఐఏ అధికార ప్రతినిధి ఒక‌రు తెలిపారు. ఈ సంస్థను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) నిషేధించడానికి వారం రోజుల ముందు సెప్టెంబర్ 19న ఫెడరల్ ఏజెన్సీ ఈ కేసును చేపట్టింది.

శనివారం రాజ‌స్థాన్ లో జ‌రిగిన సోదాల్లో డిజిటల్ పరికరాలు, ఎయిర్ గన్, పదునైన ఆయుధాలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఐఏ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ పై దాడులు చేసింది. అనేక మందిని అదుపులోకి తీసుకుని విచారించింది. అలాగే, గ‌త సెప్టెంబర్ 28 న పిఎఫ్ఐ, దాని ఎనిమిది అనుబంధ సంస్థలను కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద నిషేధించారు. ఆ త‌ర్వాత ఈ సంస్థ ఆఫీస్ బేరర్ల కార్యాలయాలు, నివాసాల నుండి అనేక‌మందిని అరెస్టు చేయ‌డంతో పాటు ప‌లు నేరపూరిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 

ఈ సంస్థ తీవ్రవాదానికి ఆజ్యం పోస్తోందనీ, ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తోందని కేంద్రం ఆరోపించింది. పీఎఫ్ఐ అనేక క్రిమినల్, టెర్రర్ కేసుల్లో ప్రమేయం ఉందని, దేశ రాజ్యాంగ అధికారాన్ని అగౌరవపరిచిందని, బయటి నుంచి నిధులు, సైద్ధాంతిక మద్దతుతో దేశ అంతర్గత భద్రతకు పెనుముప్పుగా మారిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తన ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. పీఎఫ్ఐ, దాని కార్యకర్తలు పదేపదే హింసాత్మక, విద్రోహ చర్యలకు పాల్పడుతున్నట్లు వివిధ కేసుల దర్యాప్తులో వెల్లడైందని కూడా ద‌ర్యాప్తు సంస్థ‌లు తెలిపాయి. కాలేజీ ప్రొఫెసర్ పై దాడులు, ఇతర మతాలకు చెందిన సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులను అతి కిరాతకంగా చంపడం, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడానికి పేలుడు పదార్థాలను పొందడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి హింసాత్మక చర్యలకు పీఎఫ్ఐ పాల్పడిందనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Scroll to load tweet…