తమిళనాడులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) సోదాలు నిర్వహిస్తోంది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ తమిళనాడులోని ఆరు ప్రాంతాల్లో సోదాలు జరుపుతుంది.
చెన్నై: తమిళనాడులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) సోదాలు నిర్వహిస్తోంది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ తమిళనాడులోని ఆరు ప్రాంతాల్లో సోదాలు జరుపుతుంది. ఈ క్రమంలోనే మంగళవారం ఇద్దరిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. పీఎఫ్‌ఐ మదురై ప్రాంతీయ అధ్యక్షుడు మహ్మద్ ఖైజర్, తేని ఎస్‌డీపీఐ జిల్లా కార్యదర్శి సాదిక్ అలీని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఇక, చెన్నై, మదురై, దిండిగల్, తేని జిల్లాల్లో దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు.
గత ఏడాది ప్రారంభంలో కేసు నమోదు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 12 మంది పీఎఫ్‌ఐ సభ్యులను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఈ కేసు మత ప్రాతిపదికన వివిధ వర్గాల మధ్య శత్రుత్వం సృష్టించడం, మత సామరస్యానికి విఘాతం కలిగించే చర్యలకు పాల్పడడం, ప్రజా శాంతి, ప్రశాంతతకు భంగం కలిగించడం, భారత్‌పై అసంతృప్తిని కలిగించడం వంటి కుట్రలు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించినదని అధికారులు తెలిపారు.
కేడర్‌కు మారణాయుధాలతో శిక్షణ ఇప్పించడంతోపాటు జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పీఎఫ్‌ఐ నాయకులు ఎంచుకున్న లక్ష్యాలపై దాడికి పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా ఆ సంస్థపై ఉన్నాయని చెప్పారు.
