మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్‌లపై వ్యాట్ తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 

మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్‌లపై వ్యాట్ తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై లీటరుకు రూ. 5, డీజిల్‌పై లీటర్‌కు రూ. 3 చొప్పున విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించింది. ఈ మేరకు గురువారం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.6,000 కోట్ల భారం పడుతుందని మంత్రాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విలేకరులకు తెలిపారు.

ఈ నిర్ణయాన్ని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. శివసేన, బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…

మహారాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 111.35 నుంచి రూ. 106.35కి తగ్గుతుంది. అదేవిధంగా.. డీజిల్ ధర లీటరుకు రూ. రూ. 97.28 నుంచి 94.28కి తగ్గించబడుతుంది. ఇక, ఈ తగ్గింపు తర్వాత పూణెలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105. 88కి, డీజిల్ ధర రూ. 92.37కి చేరుకోనుంది.