న్యూఢిల్లీ: పెట్రోల్, డీజీల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది,. వ్యవసాయ సెస్ పేరుతో పెట్రోల్, డీజీల్ ధరలపై కేంద్రం పన్ను విధించనుంది. దీంతో పెట్రోల్, డీజీల్ ధరలు మరింత పెరగనున్నాయి.

పెట్రోల్, డీజీల్ ధరలు ఇప్పటికే పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సెస్ ను పెట్రోల్, డీజీల్ పై వేయనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.  పెట్రోల్‌పై లీటర్ కు రూ. 2.50పై,, డీజీల్ కు రూ. 4 పన్ను వేయనుంది ప్రభుత్వం.  దీంతో ప్రస్తుతం ఉన్న ధరలకు ఈ పన్నులు తోడు కానున్నాయి.మరోవైపు ఆల్కహాల్ పై వంద శాతం వ్యవసాయ సెస్ ను కేంద్రం విధించనుంది.

aalso read:మధ్యతరగతికి గుడ్‌న్యూస్: గృహ రుణ మినహాయింపులు మరో ఏడాదికి పొడిగింపు

పెట్రోల్, డీజీల్ ధరలు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు కూడ పెరిగే అవకాశం ఉంది.ఇప్పటికే రూ. 100లకు చేరువలో పెట్రోల్, డీజీల్ ధరలున్నాయి.


పెట్రోల్, డీజీల్ ధరలు మరింతగా పెరిగితే దాని ప్రభావం ఇతర రంగాలపై పడే అవకాశం ఉంది.అంతర్జాతీయ మార్కెట్ లో  ముడి చమురు ధరలు తగ్గినా కూడ ఆ స్థాయిలో మాత్రం  పెట్రోల్, డీజీల్ ధరలు మాత్రం లేవు. అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు చాలా చౌకగా దొరుకుతున్నా కూడ దేశంలో పెట్రోల్, డీజీల్ ధరలు మాత్రం విపరీతంగా పెరిగాయి.

పెట్రోల్, డీజీల్ ధరల పెంపు శాపం అధికార బీజేపీదేనని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్  లో ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నా ఎందుకు ధరలు ఎక్కువగా ఉన్నాయని ప్రశ్నిస్తున్నాయి.