Asianet News TeluguAsianet News Telugu

వాహనదారులకు శుభవార్త... పెట్రోల్, డిజిల్ పై రూ.2.50 తగ్గింపు

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై జరుగుతున్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం  సంచలన నిర్ణయం తీసుకుంది. రోజు రోజుకు పెరిగిపోతూ  వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్న పెట్రోల్, డిజిల్ ఇందన ధరలను కాస్త తగ్గిస్తూ ఊరట కల్పించింది. రాష్ట్రాలు కూడా వీటిపై సుంకాలు తగ్గించుకుని వినియోగదారులపై భారాన్ని తగ్గించాలని ఆయా  ప్రభుత్వాలకు కోరనున్నట్లు సమాచారం.

Petrol, Diesel Prices To Be Reduced By Rs. 2.50
Author
New Delhi, First Published Oct 4, 2018, 3:56 PM IST

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై జరుగుతున్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం  సంచలన నిర్ణయం తీసుకుంది. రోజు రోజుకు పెరిగిపోతూ  వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్న పెట్రోల్, డిజిల్ ఇందన ధరలను కాస్త తగ్గిస్తూ ఊరట కల్పించింది. రాష్ట్రాలు కూడా వీటిపై సుంకాలు తగ్గించుకుని వినియోగదారులపై భారాన్ని తగ్గించాలని ఆయా  ప్రభుత్వాలకు కోరనున్నట్లు సమాచారం.

పెట్రో ఉత్పత్తులపై ప్రస్తుతం కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ.1.50 మేర తగ్గించింది. అలాగే మరో రూపాయి మేర ఆయిల్ కంపనీలు తగ్గించుకోనున్నాయి. దీంతో మొత్తంగా లీటరు పెట్రోల్, డీజిల్ లపై రూ.2.50 మేర ధర తగ్గరున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. 

తమ  వంతుగా సుంకాలను కాస్త తగ్గించి వినియోగదారులపై భారం తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పన్నులను తగ్గించుకుని ప్రజలకు మరిత ఊరట కల్పించాలని జైట్లీ కోరారు. ఆ  మేరకు కేంద్రం తరపున రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయనున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
 
రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి.  ప్రజలు కూడా ఈ ధరల పెంపుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. త్వరలో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ సెగ బిజెపికి తగలకుండా కేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios