Asianet News TeluguAsianet News Telugu

జల్లికట్టుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు 

జల్లికట్టు ఆటలో ఎలాంటి నిబంధనలు అతిక్రమించడం లేదని, ఆ పోటీల్లో పాల్గొనే ఎద్దులను యాజమానులు కన్నబిడ్డల్లా అప్యాయంగా చూసుకుంటారని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశంసించారు. బుధవారం జరిగిన విచారణ సందర్భంగా అరుదైన ఎద్దుల సంతతిని కాపాడేందుకే జల్లికట్టు క్రీడలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్న వాదన సరికాదని పెటా తరఫు న్యాయవాది అన్నారు. 

Petitioners argue against Jallikattu before SC constitution bench
Author
First Published Dec 1, 2022, 10:57 AM IST

జల్లికట్టు ఆటలో ఎలాంటి నిబంధనలు అతిక్రమించడం లేదని, ఆ పోటీల్లో పాల్గొనే ఎద్దులను యాజమానులు కన్నబిడ్డల్లా అప్యాయంగా చూసుకుంటారని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశంసించారు. తమిళనాడులో  జల్లికట్టును అనుమతించడానికి వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారించింది. జంతు హింస అని చాలా మంది పిలిచే ఈ క్రీడలో ఎద్దులను మచ్చిక చేసుకుని నిర్వహిస్తే.. క్రీడను అనుమతించవచ్చా అని పిటిషన్ లో పేర్కొన్నారు. జంతువుల పట్ల క్రూరత్వంతో కూడిన ఈ గేమ్‌ను అనుమతించరాదని పిటిషనర్ల తరఫు న్యాయవాది జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి తెలిపారు.

ఆ క్రీడలో ఎద్దులకు శిక్షణ ఇచ్చి అత్యంత ఆప్యాయంగా చూసుకుంటారని తమిళనాడు ప్రభుత్వం అభిప్రాయపడుతుందని ధర్మాసనం పేర్కొంది. జల్లికట్టు లేదా ఎద్దుల బండ్ల పోటీల్లో ఎద్దులను జంతువులుగా ఉపయోగించరాదని 2014లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దేశవ్యాప్తంగా ఈ ప్రయోజనాల కోసం వాటిని ఉపయోగించడాన్ని కోర్టు నిషేధించింది. పలు డిమాండ్ల తరువాత  తమిళనాడు జంతు హింస నిరోధక చట్టం 1960 ను కేంద్రం చట్టాన్ని సవరించి రాష్ట్రంలో 'జల్లికట్టు'ను అనుమతించింది.

జల్లికట్టుకు సంబంధించి నిబంధనలు ఉల్లఘిస్తున్నారని పిటిషనర్లు ఆరోపిస్తున్నారని, ఆ దిశగానే సుప్రీం కోర్టు  ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. న్యాయమూర్తులు స్పందిస్తూ.. కొన్ని చోట్ల నిబంధనలు ఉల్లఘించినా నిబంధనలు సక్రమంగా అమలు చేశాలని ఆదేశాలు జారీ చేస్తే సరిపోతుందని, కానీ.. జల్లికట్టు క్రీడను పూర్తిగా నిషేధించాలని కోరటం సరికాదని  కాదన్నారు. వందల సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రాచీన తమిళ క్రీడలో కాలానుగుణంగా మార్పులు జరుగుతున్నాయనీ, నిర్వహకులు కుడా ప్రభుత్వం, కోర్టు నిబంధనలను పాటిస్తున్నారని , ఆ విషయాన్ని వారు  గుర్తించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios