జైపూర్: రాజస్థాన్ లోని పెహ్లూ ఖాన్  హత్య కేసులో ఆరుగురు నిందితులను కోర్టు బుధవారం నాడు నిర్ధోషులుగా ప్రకటించింది.

రాజస్తాన్ లోని అల్వార్ జిల్లా కోర్టు బుధవారం నాడు ఈ కోర్టులో ఆరుగురు నిందితులను నిర్ధోషులుగా తేల్చింది.ఈ కేసు నమోదైన 
సమయంలో మైనర్లుగా ఉన్న ముగ్గురికి జువైనల్ కోర్టు ప్రత్యేకంగా విచారించనుంది.

2017 ఏప్రిల్ మాసంలో ఖాన్ హత్యకు గురయ్యారు.గోరక్షకులు జైపూర్-ఢిల్లీ జాతీయ రహదారిపై బెహ్రర్ వద్ద దాడికి దిగడంతో ఆయన మృతి చెందాడు.హర్యానాలోని నుహ నుండి ఆవులను తరలిస్తున్నారు. ఈ సమయంలో ఖాన్ తో పాటు ఆయన కొడుకు కూడ ఉన్నాడు. తీవ్ర గాయాలతో ఖాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.