ట్రాఫిక్ నుంచి బయటపడి ఆఫీసుకు చేరుకునే వరకు ముఖ్యమైన మీటింగ్స్ మిస్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ. మరీ ముఖ్యంగా బెంగళూరు లాంటి నగరంలో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
కరోనా కాలంలో దాదాపు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాయి. కరోనా ఉదృతి తగ్గడంతో, ఇప్పుడిప్పుడే అన్ని కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రమ్మంటున్నాయి. దీంతో అందరూ ఆఫీసుల బాట పడుతున్నారు. అయితే ఆఫీసుకు వెళ్లి పని చేయడం ఒక ఎత్తు అయితే, సమయానికి ఆఫీసుకు చేరుకోవడం మరో పెద్ద టాస్క్. ఎందుకంటే బయట ట్రాఫిక్ అలా ఉంటుంది మరి. ట్రాఫిక్ నుంచి బయటపడి ఆఫీసుకు చేరుకునే వరకు ముఖ్యమైన మీటింగ్స్ మిస్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ. మరీ ముఖ్యంగా బెంగళూరు లాంటి నగరంలో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఓ మహిళకు అదే పరిస్థితి ఎదురైంది. ఆఫీసుకు బైక్ పై బయలుదేరితే ట్రాఫిక్ భయంకరంగా ఉంది. ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడంతో ఏం చేయాలో పాలుపోక, ల్యాప్ టాప్ అక్కడే ఓపెన్ చేసి వర్క్ చేయడం మొదలుపెట్టింది. దీనిని కొందరు ఔత్సాహికులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది.
బెంగళూరు ట్రాఫిక్ అంటే ఇలానే ఉంటుంది అని కొందరు కామెంట్ చేయగా, ఇది వర్క్ ఫ్రమ్ ట్రాఫిక్ అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోని కోరమంగళ-అగార-ఔటర్ రింగ్ రోడ్ దగ్గర తీశారు. దానిని షేర్ చేయడంతో వైరల్ గా మారింది. అయితే, అక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడానికి కారణం ఉందట. ఔటర్ రింగ్ రోడ్డులోని ఇబ్బలూరు సమీపంలోని సర్వీస్ రోడ్డులోని మిలటరీ గేటు సమీపంలో చెట్టు కూలిందట. అందుకే ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించిందట. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్ సౌత్ డివిజన్), సుజీతా సల్మాన్ ట్విట్టర్‌లో స్పందించారు. మరో మార్గంలో వెళ్లండి అని చెప్పడం విశేషం.
