Asianet News TeluguAsianet News Telugu

కర్నాటకలో పేసీఎం పోస్టర్ల కలకలం..

కర్నాటకలో పేసీఎం(PayCM)పేరుతో పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్ల పై అధికార పార్టీ చాలా సీరియస్ అవుతోంది. కాంగ్రెస్ 'పేసీఎం' పోస్టర్‌పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కుట్ర పన్నారని ఆరోపించారు. 

PayCM posters with CM Bommai's face surface in Bengaluru
Author
First Published Sep 22, 2022, 3:57 AM IST

కర్నాటకలో పోస్టర్ల కలకలం చెలారేగింది. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో 'పేసీఎం'(PayCM)పేరుతో బెంగళూరులో పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్ల పై అధికార పార్టీ చాలా సీరియస్ అవుతోంది. కాంగ్రెస్ 'పేసీఎం' పోస్టర్‌పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కుట్ర పన్నారని ఆరోపించారు. దీని ద్వారా కర్ణాటక ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని అన్నారు. ఆధారం లేకుండా కాంగ్రెస్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోందని ఆరోపించారు.కేసు నమోదు చేసి దీని వెనుక ఎవరున్నారో తేల్చాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం తెలిపారు.

బుధవారం సీఎం బొమ్మై విలేకరులతో మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియాలో ఎలాంటి ఆధారం లేకుండా కాంగ్రెస్‌ వారు ప్రతికూల ప్రచారం చేస్తున్నారు. నన్ను, రాష్ట్రం పేరు చెడగొట్టేందుకు ఇలాంటి పక్కా ప్రణాళికతో కుట్రలు జరుగుతున్నాయి. దీని వెనుక ఎవరున్నారో తేల్చేందుకు కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించాను.అని పేర్కొన్నారు. 

QR కోడ్‌లో ఏముంది?

నివేదికల ప్రకారం.. పోస్టర్లలో ఉపయోగించిన QR కోడ్ రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ ప్రారంభించిన '40 శాతం ప్రభుత్వం' ప్రచార వెబ్‌సైట్‌కి దారి మళ్లిస్తుంది. మీరు ఈ QR కోడ్‌ని స్కాన్ చేస్తే, మీరు '40percentsarkara.com' వెబ్‌సైట్‌కి చేరుకుంటారు. ఇక్కడ బొమ్మై ప్రభుత్వ అవినీతిపై డేటాను అందించేలా రూపోందించారు. 

బీజేపీ సర్కార్ పై ఆరోపణలు

కాంగ్రెస్ రూపొందించిన ఈ సైట్ ద్వారా టెండర్ స్కామ్, పిఎస్‌ఐ స్కామ్, భూకబ్జా కుంభకోణం, కోవిడ్ స్కామ్ మరియు ఇతర స్కామ్‌ల్లో బీజేపీ హస్తముందనీ కాంగ్రెస్ ఆరోపించింది. ఇందులో స్కామ్ డబ్బు కూడా ఇవ్వబడింది. రాష్ట్రంలోని పలువురు కాంట్రాక్టర్లు బీజేపీ నేతలు, అధికారులకు 40 శాతం కమీషన్‌ను లంచంగా ఇస్తున్నారని ఆరోపించారు. అయితే.. బీజేపీ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ ఆరోపణలను నిరాధారమైనదిగా పేర్కొంది.
 
'40 శాతం ప్రభుత్వం' ప్రచారం
 

కర్నాటక కాంగ్రెస్‌ యూనిట్‌ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా '40 శాతం ప్రభుత్వం, బీజేపీ అంటే అవినీతి' అనే ప్రచారాన్ని నడుపుతోంది. గత వారం సీఎం బొమ్మై తెలంగాణ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో 40 శాతం కమీషన్‌ సీఎంకు స్వాగతం అని రాసి ఉన్న బ్యానర్లు కనిపించాయి. కర్ణాటక కాంట్రాక్టర్ల సంఘం 2021 జూలైలో ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖ ఆధారంగా కర్ణాటక కాంగ్రెస్ ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది, రాష్ట్రంలో లంచాల డిమాండ్ 10% నుండి 40%కి పెరిగిందని పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios