Asianet News TeluguAsianet News Telugu

PayCM poster: పే సీఎం పోస్టర్ వివాదం.. కాంగ్రెస్ నేతల అరెస్టు

Karnataka: అవినీతి ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో 'పేసీఎం'(PayCM)పేరుతో బెంగళూరులో పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్ల పై అధికార పార్టీ బీజేపీ.. ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ 'పేసీఎం' పోస్టర్‌పై..  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. కాంగ్రెస్  పై ఫైర్ అయ్యారు. 
 

PayCM poster: Pay CM poster controversy.. Congress leaders arrested
Author
First Published Sep 23, 2022, 4:19 PM IST

PayCM campaign: కర్నాటకలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ వైరం మరింతగా ముదురుతోంది. కర్నాటక అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్ని ప్రజల్లోకి వెళ్లడానికి వినూత్న కార్యక్రమానలు చేపడుతున్నాయి. అధికార పార్టీ బీజేపీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. కమీషన్ల సర్కారు అంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా బుధవారం పేసీఎం పోస్టర్లు అతికించిన ఆరోపణలపై కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్ బీఆర్ నాయుడుతో పాటు మరో ఇద్దరిని హైగ్రౌండ్ పోలీసులు ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. కర్నాటక ఓపెన్ ప్లేసెస్ ప్రివెన్షన్ అండ్ డిఫిగర్మెంట్ చట్టం, 1981లోని సెక్షన్ల కింద బెంగళూరు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పోస్టర్లపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌లు దాఖలు చేయబడ్డాయి. కేసులు నమోదుచేసిన వెంటనే బీఆర్ నాయుడుని హై గ్రౌండ్ పోలీసులు అరెస్టు చేశారు.

కాంగ్రెస్ పోస్టర్ ప్రచారానికి వ్యతిరేకంగా బీజేపీ ఎదురుదాడికి దిగింది. మాజీ సిఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ చిత్రాలతో క్యూఆర్ కోడ్‌తో కూడిన పోస్టర్‌లను విడుదల చేసింది. ఈ ఇద్దరు నాయకులను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి అంటూ క్యూర్ కోడ్ లో పేర్కొంది. ఈ క్రమంలోొనే క్యూఆర్ కోడ్ పోస్టర్ల వివాదం మరింద ముదిరింది. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్దాన్ని తారాస్థాయికి తీసుకెళ్లింది. కాంగ్రెస్‌ కార్యకర్తల అరెస్ట్‌తో ఉభయ సభల్లో బీజేపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నివాసం ఉన్న రేస్‌కోర్స్ రోడ్‌తో పాటు బహిరంగ ప్రదేశాల్లో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పోస్టర్‌లను అతికించి, అధికార బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ బుధవారం పోస్టర్ ప్రచారాన్ని చేపట్టింది. నాయుడు, ఇతర పార్టీ కార్యకర్తల అరెస్టుపై కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్..  గురువారం ఉదయం హైగ్రౌండ్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు.

మరోవైపు విధానసౌధలో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య గురువారం అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి వ్యతిరేకంగా తమ ప్రచారాన్ని వేగవంతం చేయాలనీ, పోలీసుల అరెస్టులపై పార్టీ కార్యకర్తలు మౌనంగా ఉండరని అన్నారు. నాయుడు హత్య కోసం  అరెస్టు చేశారా? అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఆ పార్టీ చేస్తున్న ప్రచారంలో భాగమే పేసీఎం పోస్టర్ ప్రచారం అని అన్నారు. క్యూఆర్‌కోడ్‌ పోస్టర్‌లో చిత్రాన్ని ఉపయోగించడం బాధ కలిగించిందని న్యాయశాఖ మంత్రి మధుస్వామి అసెంబ్లీలో అన్నారు. అసెంబ్లీలో, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పేసిఎం పోస్టర్లపై తాను బాధపడ్డానని న్యాయశాఖ మంత్రి మధుస్వామి అన్నారు, బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ "క్యూఆర్ కోడ్ పోస్టర్‌లో ముఖ్యమంత్రి చిత్రాన్ని ఏ ప్రాతిపదికన చేర్చారు?" అని ప్రశ్నించారు.  కౌన్సిల్‌లో, కాంగ్రెస్ శాసనసభ్యులు-బీకే హరిప్రసాద్, ప్రకాష్ రాథోడ్ పేసిఎం పోస్టర్‌లను ప్రదర్శించారు.

ఇదిలావుండగా, కర్నాటక మంత్రి అశ్వత్‌నారాయణ రాజీనామా చేయాలని హెచ్‌డి కుమారస్వామి డిమాండ్ చేశారు. ఆయనపై కుమారస్వామి అవినీతి ఆరోపణలు చేశారు. విచారణ కోరుతూ ప్రధాని మోదీకి లేఖ కూడా రాసే అవకాశం ఉంది. ఇది పెద్ద రాజకీయ వివాదంగా మారే అవకాశం ఉందని స్థానిక మీడియా కథనలు పేర్కొంటున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios