ముంబై:నూతన రైతు చట్టాలను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతిచ్చేవారు, వ్యతిరేకించేవారు సోషల్ మీడియా వేదికగా తమ వాదనలను విన్పిస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడ ఈ ఉద్యమం విషయంలో రెండు వర్గాలుగా విడిపోయి తమ వాదనలను సమర్ధించుకొంటున్నారు.

ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రైతుల ఉద్యమం గురించి చేసిన వ్యాఖ్యలపై మాజీ కేంద్ర మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చురకలలంటించారు.

రైతుల ఉద్యమం గురించి వ్యాఖ్యలు చేసే సమయంలో జాగ్రత్త వహించాలని శరద్ పవార్ సచిన్ టెండూల్కర్ కు సూచించారు.
సాగు చట్టాలను నిరసిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు చేస్తున్నవారిని ఉగ్రవాదులుగా, ఖలీస్థానీలుగా కేంద్రం చూడడం సరైందికాదని ఆయన మండిపడ్డారు.

క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పై మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు కూడ అదే స్థాయిలో స్పందించారు. మోడీ లేదా అమిత్ షా లేది మరే ఏ ఇతర బీజేపీ నేతలు వామపక్షనేతలను కానీ, అర్బన్ నక్సల్స్ ను బెదిరించడం మీరు విన్నారా అని ప్రశ్నించారు.

అయితే సచిన్ టెండూల్కర్ ను శరద్ పవార్ బెదిరించారని ఆ నెటిజన్ అభిప్రాయపడ్డారు. ఫాసిస్ట్ ఎవరని ఆయన ప్రశ్నించారు. మరొకరు శరద్ పవార్ ను ఫాసిస్ట్ అంటూ ఘాటైన పదజాలాన్ని ఉపయోగించారు.

రైతుల ఉద్యమం గురించి క్రికెటర్లు విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్ లు వేర్వేరుగా స్పందించారు.  అయితే వీరిద్దరూ కూడ ట్రోల్స్ కు గురయ్యారు.