ఊరూరా మత ప్రచారం చేస్తూ.. అందమైన అమ్మాయిలపై అత్యాచారం.. 30 పెళ్లిళ్లు

First Published 11, Oct 2018, 1:40 PM IST
Pastor Millan Singh held for Sexual Assault & Cheated 30 woman
Highlights

మత ప్రచారం కోసం ఊరురా తిరుగుతూ ఆ వూళ్లోని అందమైన అమ్మాయిలపై అత్యాచారం చేస్తూ.. 30 మందిని పెళ్లి చేసుకుని వారి జీవితాలతో ఆటలాడాడు ఓ పాస్టర్.

మత ప్రచారం కోసం ఊరురా తిరుగుతూ ఆ వూళ్లోని అందమైన అమ్మాయిలపై అత్యాచారం చేస్తూ.. 30 మందిని పెళ్లి చేసుకుని వారి జీవితాలతో ఆటలాడాడు ఓ పాస్టర్. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా ఉక్కిరన్ కోట ప్రాంతానికి చెందిన మిలన్ సింగ్‌ పాస్టర్‌గా ఉంటూ.. ఊరురా తిరుగుతూ క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నాడు..

ఈ క్రమంలో తన అత్త కూతురు డైసీని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇరువురు విడిపోయారు.. ఆ తర్వాత సలోమీ అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు.. కొద్దిరోజులకు సలోమీ చెల్లెలు జెన్నీఫర్ రాణిని చెరబట్టి ఆమెను మూడో పెళ్లి చేసుకున్నాడు.

ఆమెతో కోయంబత్తూరులో కాపురం చేస్తూ.. తన వద్ద బైబిల్ పాఠాలు నేర్చుకునేందుకు వచ్చిన జీవిత అనే యువతికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి ఊరురా క్రైస్తవ మత ప్రచారం చేస్తూ.. ఆ వూళ్లలోని అందమైన అమ్మాయిలకు వల వేసి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఆ తర్వాత వారిలోనే కొందరిని పెళ్లి చేసుకున్నాడు..

ఇలా సుమారు 30 మంది యువతులను పెళ్లి చేసుకుని వారి జీవితాలను నాశనం చేశాడు. అంతేకాకుండా ఓ మహిళను సైతం హత్య చేశాడు. అయితే ఒక వూరిలో జరిగిన మేకల దొంగతన కేసులో పోలీసులు మిలన్‌సింగ్‌ను అరెస్ట్ చేసి ప్రశ్నించడంతో మనోడి బండారం బయటపడింది. 

loader