Asianet News TeluguAsianet News Telugu

రద్దీ ట్రైన్‌లో స్పైడర్‌మ్యాన్ తరహా స్టంట్: వీడియో వైరల్

రైలులో ఓ వ్యక్తి  స్పైడర్ మ్యాన్ గా టాయిలెట్ కు వెళ్లే దృశ్యాలు  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Passenger's 'Spiderman' Stunt In Overcrowded Train To Reach Toilet Is Viral  lns
Author
First Published Apr 3, 2024, 11:13 AM IST | Last Updated Apr 3, 2024, 11:16 AM IST

న్యూఢిల్లీ: రద్దీగా ఉన్న రైలులో  టాయిలెట్ వెళ్లేందుకు  ఓ ప్రయాణీకుడు స్పైడర్ మ్యాన్ మాదిరిగా చేసిన ప్రయత్నం  సోషల్ మీడియాలో వైరల్ గా  మారింది.  ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన  కొన్ని గంటల్లోనే వందలాది మంది ఈ వీడియోను చూశారు.  రైళ్లలో  వందలాది మంది ప్రయాణిస్తున్నారు. ఈ వీడియోను చూస్తే భారతీయ రైల్వే శాఖ ఎదుర్కొంటున్న సవాళ్లను నొక్కి చెబుతుంది.

 

 

ఈ వీడియోపై  నెటిజన్లు  తలోరకంగా  వ్యాఖ్యానించారు. ఈ వీడియోను చూస్తే స్పైడర్ మ్యాన్ ను గుర్తు చేసినట్టుగా  కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు.స్పైడర్ మ్యాన్  నో వే టాయిలెట్ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.కిటికిలు ఏమైనప్పటికి తలుపులు మాత్రమే అనే క్యాప్షన్ తో సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్టు చేశారు.భారతీయ రైలులో సాధారణ ప్రయాణీకుడికి ఎదురైన కష్టాలను  ఈ వీడియో చూపిందని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.అభివన్ అనే వ్యక్తి  ఇన్‌స్టాగ్రామ్ లో  ఈ వీడియోను పోస్టు చేశారు.  ఈ వీడియో పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే  ఈ వీడియోపై నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
 

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios