Dehradun:ఉత్తరాఖండ్ లో 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు ప్ర‌మాదవ‌శాత్తు లోయలో పడిపోయింది. స‌మాచారం అందుకున్న అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేప‌ట్టింది. వీరిలో ముగ్గురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. 

Bus With 22 Onboard Falls Into Ditch: ఉత్తరాఖండ్ లో 22 మందితో వెళ్తున్న ఒక బస్సు ప్ర‌మాదవ‌శాత్తు లోయలో పడిపోయింది. స‌మాచారం అందుకున్న అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేప‌ట్టింది. వీరిలో ముగ్గురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఆదివారం ముస్సోరీ-డెహ్రాడూన్ రహదారిలో వెళ్తున్న క్ర‌మంలో బస్సు లోయ‌లో పడటంతో బస్సు డ్రైవర్ సహా 22 మంది గాయపడ్డారు. అయితే, లోయ లోతు త‌క్కువ‌గా ఉండ‌టంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. కానీ వీరిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని స‌మాచారం.

Scroll to load tweet…

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సహాయంతో క్షతగాత్రులను రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ముస్సోరీ పోలీసులు తెలిపారు. ముగ్గురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.