Asianet News TeluguAsianet News Telugu

ఎంపీల విజ్ఞప్తి .. లోక్‌సభ సమావేశాల వేళల్లో మార్పులు

లోక్‌సభ సమావేశాల వేళల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. రేపట్నుంచి ఉదయం 11 గంటలకే సభ ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారికి ముందు జరిగినట్టుగానే పార్లమెంట్‌ ఉభయ సభల సమావేశాలూ ఏకకాలంలో ప్రారంభం కానున్నాయి

Parliament to resume in normal timing from March 9 ksp
Author
New Delhi, First Published Mar 8, 2021, 4:25 PM IST

లోక్‌సభ సమావేశాల వేళల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. రేపట్నుంచి ఉదయం 11 గంటలకే సభ ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారికి ముందు జరిగినట్టుగానే పార్లమెంట్‌ ఉభయ సభల సమావేశాలూ ఏకకాలంలో ప్రారంభం కానున్నాయి.

సమావేశాల వేళల్లో మార్పులు చేయాలని పలు పార్టీలకు చెందిన ఎంపీలు కోరడంతో రాజ్యసభ ఛైర్మన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎంపీ వందనా చవాన్‌ తెలిపారు. దీంతో రాజ్యసభ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.

రాజ్యసభ సభ్యులు ఇకపై రాజ్యసభ, గ్యాలరీలలోనే కూర్చోనున్నారు. మరోవైపు, పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలను కుదించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. హోలీ పర్వదినానికి ముందే ఈ సమావేశాలు ముగిసే అవకాశం ఉంది.   

మరోవైపు, ఇవాళ్టీ నుంచి ప్రారంభమైన పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగింది. చమురు, వంటగ్యాస్ ధరల పెంపుపై రాజ్యసభలో విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి.

దీంతో ఉదయం నుంచి సభ మూడు సార్లు వాయిదా పడింది. అయినప్పటికీ సభ్యుల ఆందోళన కొనసాగడంతో సభను ఛైర్మన్ రేపటికి వాయిదా వేశారు. మరోవైపు, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాలను వాయిదా వేయాలని తృణమూల్ కాంగ్రెస్ నేతలు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios