Parliament Monsoon Session: పార్ల‌మెంట్ వర్షాకాల సమావేశాలు 2022  ముగిశారు. 16 రోజుల పాటు సాగిన ఈ స‌మావేశాల్లో లోక్ స‌భ‌లో 7 బిల్లుల‌ను, రాజ్య‌స‌భ‌లో 5 బిల్లుల‌ను ఆమోదించారు. రాజ్యసభలో ఉపరాష్ట్రపతి వెంక‌య్య‌నాయుడు వీడ్కోలు స‌మావేశంతో తుదిరోజు స‌మావేశాలు ముగిశాయి. 

Parliament Monsoon Session: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్ణీత గడువు కంటే ముందుగానే ముగిశాయి. జులై 18న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ ప్ర‌కారం ఆగస్టు 12 వరకు కొనసాగాలి. కానీ, నిర్ణీత సమయానికి 4 రోజుల ముందుగా పార్ల‌మెంట్ స‌మావేశాలు ముగిశారు. ప్ర‌ధానంగా రెండు రోజుల సెలవుల దృష్ట్యా, ప్రభుత్వ వ్యవహారాలు, సభ్యుల డిమాండ్‌ మేరకు సమావేశాలను రెండు రోజులపాటు కుదించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో సోమవారం పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. గడువు కంటే ముందే పార్లమెంటు వాయిదా పడడం ఇది ఏడోసారి. ఆ తర్వాత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కార్యాలయంలో విపక్ష నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

వాయిదాకు ప్ర‌ధాన కార‌ణం ఇదే..!

ఈసారి ముహర్రం ఆగస్టు 9న, రక్షాబంధన్ ఆగస్టు 11న జ‌ర‌గ‌నున్నాయి. ఈ రెండు రోజులూ పార్లమెంటు సమావేశాలు జరగలేదు. పండుగల కంటే ముందే ఎంపీలు తమ నియోజకవర్గాలకు వెళ్లాలని భావించారనే వాదన వినిపిస్తోంది. శాసనసభ ఎజెండా చాలా వరకు పూర్తయినందున సెషన్‌ను కుదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సభను తగ్గించాలన్న సభ్యుల డిమాండ్‌ను నెరవేర్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

కేంద్ర నిర్ణ‌యంపై టీఎంసీ ఎంపీ ఫైర్

ఈ నిర్ణయంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఈ సందర్భంగా ఓ'బ్రియన్‌ ట్వీట్‌ చేశారు. పార్లమెంటు సమావేశాలను కుదించడం వరుసగా ఇది ఏడోసారి అని ఆయన అన్నారు. సమయాభావం కారణంగా ఆ సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం నిరాకరించిందని గత కొన్ని సమావేశాల్లో ప్రతిపక్షాలు పదే పదే ఫిర్యాదులు చేస్తున్నాయి.

వ‌ర్షాకాల స‌మావేశాలు 16 రోజుల పాటు జ‌రిగాయి. ఇందులో 7 చట్టాలు ఆమోదించామని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఇక రాజ్యసభ వాయిదాకు ముందు.. ఉపరాష్ట్రపతి పదవీ విరమణ చేయనున్న వెంకయ్యనాయుడు సైతం రాజ్యసభ కార్యకలాపాల గురించి వివరించారు. దాదాపు 38 గంటల పాటు స‌మావేశాలు జ‌రిగియ‌నీ, అంతరాయాల కారణంగా 47 గంటలకు పైగా సమయం వృథా అయిందని ప్ర‌క‌టించారు. ఇక పార్లమెంట్‌ సమావేశాల పేరిట చేసిన పద్దుల వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.

అలాగే నేడు రాజ్యసభలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగియగా, ఆగస్ట్ 11న ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.