ఎంగేజ్ మెంట్ అయిపోయింది... మరికొద్ది రోజుల్లో పెళ్లి అనగా...పెళ్లి కుమార్తె.. తన ప్రియుడితో లేచిపోయింది. ఆ వార్త ఆమె తల్లిదండ్రులను కలచివేసింది.

ఎంగేజ్ మెంట్ అయిపోయింది... మరికొద్ది రోజుల్లో పెళ్లి అనగా...పెళ్లి కుమార్తె.. తన ప్రియుడితో లేచిపోయింది. ఆ వార్త ఆమె తల్లిదండ్రులను కలచివేసింది. ఈ విషయం తమ బంధువులకు తెలిస్తే.. పరువు పోతుందని భావించారు. అంతే వెంటనే వధువు తల్లిదండ్రులు ఇద్దరూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన బెంగళూరు సమీపంలోని గౌరిబిదనూరు తాలూకా దేవనహళ్లిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన చౌడప్ప (45), చౌడమ్మ (40) కుమార్తె చిన్నకుమార్తెకు ఇటీవలే వివాహం నిర్ణయించారు. పెళ్ళికి కావాల్సినంటినీ కూడా తల్లిదండ్రులు సిద్ధం చేసుకుంటున్నారు. మరి కొద్ది రోజుల్లో పెళ్లి అనగా వారి కుమార్తె, ప్రియుడితో కలసి పరారీ అయ్యింది. 

జీర్ణించుకోలేని తల్లిదండ్రులు గ్రామ శివారులోని చింతచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న మంచేనహళ్ళి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.