Asianet News TeluguAsianet News Telugu

పకోడీవాలా ఇంటిపై దాడులు.. ఐటీ అధికారులకు షాక్.. రూ.60 లక్షల ఫైన్

పకోడివాలా ఇంటిపై దాడి చేసిన ఐటీ అధికారులకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన పన్నాసింగ్ కుటుంబం 1952లో పకోడీల వ్యాపారం మొదలుపెట్టింది. 

panna singh pakode wala surrenders 60 lakh to Income tax department
Author
Ludhiana, First Published Oct 7, 2018, 1:10 PM IST

పకోడివాలా ఇంటిపై దాడి చేసిన ఐటీ అధికారులకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన పన్నాసింగ్ కుటుంబం 1952లో పకోడీల వ్యాపారం మొదలుపెట్టింది. రుచికి రుచి.. నాణ్యత బాగుండటంతో కొద్దికాలంలో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో వీరి వ్యాపారం బాగా వృద్ధి చెందింది. వందలు, వేల నుంచి లక్షల టర్నోవర్ స్థాయికి ఎదిగింది.

మనోడి పకోడి రుచికి రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, వ్యాపార వేత్తలు, సినీనటులు కూడా దాసోహం అయ్యారు. నెలకు లక్షల్లో ఆదాయం వస్తున్నా.. పన్నా సింగ్ కుటుంబం మాత్రం నామమాత్రంగా పన్ను చెల్లిస్తూ వస్తున్నారు.

దీనిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం అందడంతో లూథియానాలోని అతని షాపు, ఇంటిపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. రికార్డులు పరిశీలించగా పన్నాసింగ్ భారీగా పన్ను ఎగ్గొడుతున్నట్లుగా తేలింది. దీంతో అప్పటికప్పుడే అతడితో రూ.60 లక్షల ట్యాక్స్ కట్టించారు. ఇదే ప్రాంతంలో ఓ డ్రైఫ్రూట్స్ వ్యాపారి ఇంటిపైనా దాడి చేసి... వెంటనే అతనితో రూ.కోటీ ట్యాక్స్ కట్టించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios