Asianet News TeluguAsianet News Telugu

శివసేనలోకి పంకజ ముండే? ట్విట్టర్ బయోలో బీజేపీ లీడర్ అని తొలగింపు

మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ గోపినాథ్ ముండే కూతురు పంకజా ముండే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పంకజ ముండే తన సోదరుడు వరుసయ్యే ధనుంజయ్ ముండే చేతిలో పర్లి నియోజకవర్గంలో ఓటమి చెందడంతో ఈ సమస్య తెర మీదకు వచ్చింది. 

pankaja munde to join shiv sena? removes the tag as bjp leader from her twitter bio
Author
Mumbai, First Published Dec 2, 2019, 11:43 AM IST

ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు చాలా వేడిగా, వాడిగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారంతో మహారాష్ట్ర రాజకీయాలు ఇక సమసిపోయాయి అనుకుంటున్నా తరుణంలో బీజేపీకి ఒక ఊహించని షాక్ తగిలేలా ఉంది. 

మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ గోపినాథ్ ముండే కూతురు పంకజా ముండే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పంకజ ముండే తన సోదరుడు వరుసయ్యే ధనుంజయ్ ముండే చేతిలో పర్లి నియోజకవర్గంలో ఓటమి చెందడంతో ఈ సమస్య తెర మీదకు వచ్చింది. 

ఇందాక కొద్దిసేపటి క్రింద ఆమె తన ట్విట్టర్ బయోలో బీజేపీ లీడర్ అనే పదాన్ని తొలగించింది. ఆమె నిన్ననే ఒక బాంబు పేల్చి అందరిని విస్మయానికి గురి చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 12వ తారీఖునాడు తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా రాజకీయ భవిష్యత్తు గురించి తన అనుచరులతో చర్చిస్తానని చెప్పారు. 

Also read: గోవా రాజకీయాల్లో సంజయ్ రౌత్ వేలు... అక్కడ బీజేపీ అధికారం కోల్పోతుందని జోశ్యం

ఇది జరిగిన 24గంటల్లోపే ఆమె ఇలా ట్విట్టర్ బయోను మార్చడం చర్చనీయాంశంగా మారింది. అసలు పంకజా ముండే ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం కూడా లేకపోలేదు. తన తండ్రి వారసుడెవ్వరనే ప్రశ్న ఇక్కడ ఉద్భవించింది.

ఈ సారి తనకు అత్యంత పట్టున్న, తన కుటుంబ కంచుకోటగా భావించే పేర్ల లో ఆమె ఓటమి చెందింది. ఓడించింది ఎవరో కాదు, తనకు వరుసకు అన్నయ్య అయ్యే ధనుంజయ్ ముందే చేతిలో. ఇలా ఓడిపోవడంతో, తన తండ్రి వారసత్వం తన చేతికి కాకుండా తన అన్న చేతికి ఎక్కడ పోతుందో అనే భయం పంకజా ముండేలో మొదలయ్యింది. 

ఒకవేళ గనుక పంకజా ముండే గనుక గెలిచి ఉంటె, ఆమె ఈ సరి ముఖ్యమంత్రి పదవికి కూడా పోటీలో ఉండేది. తొలుత ఫడ్నవీస్ మిత్రవర్గంలో ఉన్న ఈమె, ఆ తరువాత సైడ్ లైన్ చేయబడింది. ఈ విషయమై ఈమె చాల గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా ఇప్పుడు మహారాష్ట్రలో అధికారం కూడా కోల్పోవడంతో పంకజా ముండే ఆలోచనలో పడింది. 

గోపినాథ్ ముండే అత్యంత పాపులారిటీ కలిగిన లీడర్. ఆయన లోక్ నేత గా మహారాష్ట్ర ప్రజలు ఈయనను పిలిచేవారు. ఇలాంటి నాయకుడి కూతురును నన్ను ఇలా పక్కకు పెట్టారు అని పంకజా ముండే గుర్రుగా ఉన్నారని సమాచారం. 

ఈ నేపథ్యంలోనే ఆమె అయితేనా, తన మద్దతుదారులైన 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని శివసేనతో చేరుతారనే ప్రచారం సాగుతుంది. దీన్ని ఎలాగైనా ఆపడానికి బీజేపీ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

Also read: తెరపైకి శివాజీ.. హిందుత్వ స్థానేనా లౌకికత్వం..ఆసక్తికరంగా మహా రాజకీయం

అందుతున్న సమాచారం మేరకు పంకజా కు బీజేపీ మహారాష్ట్ర పగ్గాలను అప్పగించొచ్చని, లేదా ఎమ్మెల్సీ కోటాలో మండలికి పంపించి అక్కడ మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకురాలిని చేయాలనీ ఈ మీ కోరినట్టు తెలుస్తుంది. 

చూడాలి పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో. తన తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళతాను అని చెబుతుంది, దానికి తోడు బీజేపీ నేత అనే టాగ్ ను కూడా తొలగించడంతో పంకజా ముండే బీజేపీని వీడవచ్చనే బలమైన సంకేతాలు వస్తున్నాయి.

ఇక్కడ కాకపోతే ఇంకో ఆసక్తికరమైన అంశం దాగి ఉంది. పంకజా ముండే చెల్లి ప్రీతం ముండే బీడ్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా కొనసాగుతుంది. 

చెల్లెలి రాజకీయ భవిష్యత్తుతో కలిపి నిర్ణయం తీసుకుంటుందా లేదా తన దారి మాత్రమే తనది అని చూసుకొని పార్టీ మారుతుందా అనేది మాత్రం వేచి చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios