Daler Mehndi : ప్రముఖ నేపథ్య గాయకుడు దలేర్ మెహందీ అరెస్ట్ అయ్యారు. 2003లో మానవ అక్రమ రవాణ కేసులో శిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇవ్వడంతో పంజాబ్ పోలీసులు దలేర్ మెహందీని అదుపులోకి తీసుకున్నారు.
Daler Mehndi : ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్ మెహందీ అరెస్ట్ అయ్యారు. మానవ అక్రమ రవాణా కేసులో దలేర్ మెహందీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది. దలేర్ పై 2003లో మానవ అక్రమ రవాణ కేసులో నమోదైంది. ఇప్పటికే 2018లో ఈ కేసులో దలేర్ మెహందీకి ట్రయల్ కోర్టు 2 సంవత్సరాల శిక్ష విధించింది. ఆ తర్వాత దలేర్ మెహందీకి బెయిల్ వచ్చింది. ఈ తీర్పును దలేర్ మెహందీ సెషన్స్ కోర్టులో సవాలు చేశారు. గురువారం అదనపు సెషన్స్ జడ్జి దలేర్ మెహందీ అప్పీల్‌ను తిరస్కరించారు.
అయితే.. తాజాగా ఈ కేసుపై పాటియాల కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మెహందీ విజ్ఞప్తిని పాటియాలా అదనపు సెషన్స్ జడ్జి తోసిపుచ్చారు. రెండు సంవత్సరాల శిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇవ్వడంతో పంజాబ్ పోలీసులు దలేర్ మెహందీని అదుపులోకి తీసుకున్నారు. 2003 మానవ అక్రమ రవాణా కేసులో గాయకుడు దలేర్ మెహందీకి రెండేళ్ల జైలు శిక్ష విధించినట్లు ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది గుర్మీత్ సింగ్ తెలిపారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రొబేషన్‌పై విడుదల చేయాలని ఆయన చేసిన దరఖాస్తును కూడా కోర్టు తిరస్కరించింది.
అసలు విషయం ఏమిటి?
సింగర్ దలేర్ మెహందీ, అతని సోదరుడు షంషేర్ సింగ్ తమ సంఘంలో సభ్యులుగా ఉన్న వ్యక్తులను చట్టవిరుద్ధంగా విదేశాలకు పంపినందుకు భారీగా డబ్బు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. 2018లో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఈ సోదరులను దోషులుగా నిర్ధారించి వారికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత బెయిల్ మంజూరైన తర్వాత సెషన్స్ కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.
2003లో సదర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. మెహందీ విదేశాల్లో పాడటానికి వెళ్లినపుడు.. తన వెంట కొంత మంది వ్యక్తులను తాత్కాలిక వీసాల మీద వివిధ దేశాలకు తీసుకెళ్లి.. అక్కడే ఒదిలేసేసారు. ఇలా ఆయన ప్రోగ్రామ్ ల పేరు మీద దేశాల్లోకి వ్యక్తులను అక్రమంగా తీసుకెళ్లి వీడిచి పెట్టేవాడు. ఈ అక్రమ రవాణాలో దలేర్ మెహందీతో పాటు అతని సోదరుడు షంషేర్ కూడా కీలకంగా వ్యవహరించారని, ప్రధానంగా విదేశాల్లో స్థిరపడాలనుకునే వ్యక్తులను టార్గెట్ చేస్తూ .. అక్కడ వదిలి పెట్టి రావడానికి ఇక్కడ తగినంత డబ్బును దలేర్ మెహందీ తన సోదరుడితో కలిసి దండుకునేవాడని ఆరోపణలున్నాయి.
మెహందీ సోదరులు 1998- 1999లో సమావేశాలను ఏర్పాటు చేశారనీ, ఆ సమయంలో 10 మందిని గ్రూప్‌లో సభ్యులుగా యుఎస్‌కు తీసుకెళ్లి అక్రమంగా వదిలిపెట్టారని ఆరోపించారు. మొదటి ఫిర్యాదును నమోదు చేసిన తర్వాత, గాయకుడిపై పోలీసులకు మరో 35 ఫిర్యాదులు వచ్చాయి.
పోలీసుల దాడులు
ప్రజలను అక్రమంగా విదేశాలకు (ఎక్కువగా కెనడా, యుఎస్) పంపడానికి బదులుగా వారి నుండి దాదాపు రూ. 12 లక్షలను తీసుకున్నారు. పెద్ద మొత్తంలో డబ్బుకు బదులుగా తన విదేశీ కార్యక్రమాలలో డ్యాన్స్ ట్రూప్‌లలో భాగంగా ప్రజలను విదేశాలకు పంపుతానని ప్రజలకు వాగ్దానం చేశాడు. దీని తరువాత, న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని దలేర్ మెహందీ కార్యాలయంపై దాడి చేసి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్న తరువాత, పంజాబ్ పోలీసులకు దలేర్ మెహందీకి వ్యతిరేకంగా తగిన ఆధారాలు లభించాయి. ఆ తర్వాత కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
సింగర్ దలేర్ మెహందీ వ్యక్తిగత విషయానికొస్తే..
ఆయన 18, ఆగష్టు 1967 బిహార్‌లోని పాట్నాలో జన్మించారు. దలేర్ సింగర్‌గా, పాటల రచయతగా.. అలాగే.. మంచి నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రధానంగా భాంగ్రా డాన్సుల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాల్లో గాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘బోలో తరా రా రా’ పాటతో ఎక్కుగా పాపులర్ అయ్యారు. ఆయన అమితాబ్ ‘మృత్య దాత’ సినిమాతో సింగర్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.
