Serum Institute Cervical Cancer Vaccine: సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ (qHPV) వ్యాక్సిన్‌కు DCGI కమిటీ ఆమోదించింది. అత్య‌వ‌స‌ర సిఫార్సు చేసింది. 

Serum Institute Cervical Cancer Vaccine: ప్రతి సంవత్సరం లక్షలాది మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో పాటు కొన్ని ఇతర క్యాన్సర్‌లతో బాధపడుతున్నారు. మరణాల సంఖ్య కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. 15నుండి 44 సంవత్సరాల మధ్య మహిళల్లో ఈ క్యాన్స‌ర్ అధికంగా బ‌య‌ట‌ప‌డుతుంది. ఈ క్యాన్సర్ బారిన ప‌డిన దేశాల్లో భార‌త్ రెండవ స్థానంలో ఉంది. ఈ నేప‌థ్యంలో సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ ఇండియా (SII) ద్వారా దేశీయంగా అభివృద్ధి చేసిన క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ (qHPV) వ్యాక్సిన్‌ను DCGI సబ్జెక్ట్ నిపుణుల కమిటీ ఆమోదించింది. ఈ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్‌పై పోరాడుతుందని సిఫార్సు చేసింది.

వివరాల్లోకెళ్తే.. కోవిడ్ -19 పై DCGI సబ్జెక్ట్ నిపుణుల కమిటీ బుధవారం దాని ఉపయోగం గురించి చర్చించింది. యాంటీ సర్వైకల్ క్యాన్సర్ QHPV తయారీకి మార్కెట్ మార్కెటింగ్ ఆమోదం కోసం సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ని సిఫార్సు చేసింది. SII డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ జూన్ 8న QHPV ఆమోదం కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DGCI)ని సంప్రదించారు. మార్కెట్ మార్కెటింగ్ ఆమోదం కోసం దరఖాస్తు చేశారు.

ఈ మేరకు దరఖాస్తులో ఇలా పేర్కొన్నారు. అప్లికేషన్‌లో.. QHPV వ్యాక్సిన్ CervaVac అన్ని HPV ఫారమ్‌లలో, అన్ని మోతాదులు, వయస్సు సమూహాలలో బేస్‌లైన్ కంటే దాదాపు 1,000 రెట్లు ఎక్కువ యాంటీబాడీ ప్రతిస్పందనను ప్రదర్శిస్తుందని సింగ్ చెప్పారు. ప్రతి సంవత్సరం లక్షల మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో పాటు మరికొన్ని క్యాన్సర్‌లతో బాధపడుతున్నారని, మరణాల నిష్పత్తి కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. భారతదేశంలో గర్భాశయ క్యాన్సర్ 15 నుండి 44 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో ఈ కాన్సర్స్ బారిన అధికంగా ప‌డుతున్నార‌ని తెలిపారు.

అనేక ఇతర స్వదేశీ వ్యాక్సిన్‌ల మాదిరిగానే, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ప్రాణాలను రక్షించే qHPV టీకా కోసం మన దేశాన్ని స్వావలంబనగా మార్చడానికి మేము కూడా కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. ఇది మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ కల ‘ఓకల్ ఫర్ లోకల్’ నెరవేరుతుంద‌ని తెలిపారు.

వ్యాక్సిన్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది?

వ్యాక్సిన్ (సెర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్) 2022 చివరిలోపు మార్కెట్లోకి విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు. గర్భాశయ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా తయారు చేయబడిన వ్యాక్సిన్ HPV. దేశంలో దాని ప్రారంభ లభ్యతను నిర్ధారించడానికి పూణెకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా బయోటెక్నాలజీ విభాగం మద్దతుతో ఫేజ్ 2/3 క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసిన తర్వాత మార్కెట్ ఆథరైజేషన్ కోసం దరఖాస్తు చేసింది.