భారత తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ అమెరికా పర్యటన ఫోటోకు సంబంధించి తప్పులో కాలేసిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు.

మంగళవారం మరో  ఫోటో షేర్ చేసిన ఆయన.. ‘‘ తమ ప్రధాని 1949లో అమెరికాలో పర్యటించినప్పటి ఫోటో అని.. అప్పట్లో నెహ్రూ ప్రసంగం వినేందుకు అమెరికన్లు పోటెత్తారని తెలిపారు.

అంతేకాకుండా ఓ అమెరికా అధ్యక్షుడి నుంచి ఎయిర్‌పోర్టులోనే ఘనస్వాగతం అందుకున్న ఏకైక భారత ప్రధాని నెహ్రూనే అన్నారు. ఈ గౌరవం ఆయనకు 1949లో ట్రూమన్ నుంచి, 1961లో జాన్ ఎఫ్ కెన్నడీ నుంచి రెండు సార్లు అందుకున్నారని శశిథరూర్ ట్వీట్ చేశారు.

కాగా.. నెహ్రూ అమెరికా పర్యటనకు సంబంధించి ఆయన షేర్ చేసిన ఫోటో సోవియట్ యూనియన్‌‌ది కావడంతో నెటిజన్లు శశిథరూర్‌పై సెటైర్లు వేశారు.