సమగ్ర మానవతావాదానికి మార్గదర్శకుడైన దీనదయాళ్ ఉపాధ్యాయ స్మారక దినోత్సవాన్ని (pandit deen dayal upadhyay memorial webinar ) పురస్కరించుకుని స్మారక చిహ్నాలు, వారసత్వ సంపద పరిరక్షణపై ప్రపంచవ్యాప్త అవగాహన కల్పిస్తూ వస్తున్నారు

సమగ్ర మానవతావాదానికి మార్గదర్శకుడైన దీనదయాళ్ ఉపాధ్యాయ స్మారక దినోత్సవాన్ని (pandit deen dayal upadhyay memorial webinar ) పురస్కరించుకుని స్మారక చిహ్నాలు, వారసత్వ సంపద పరిరక్షణపై ప్రపంచవ్యాప్త అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని దాదాపు 20 దేశాలకు చెందిన నిపుణులు వారసత్వ పరిరక్షణ గురించి తమ అభిప్రాయాలు పంచుకున్నారు. నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ ICCR, కేంద్ర విదేశాంగ శాఖ (MEA) సహకారంతో శుక్రవారం 'స్మారక చిహ్నాల పరిరక్షణ మరియు జాతీయ వారసత్వ పరిరక్షణకు వాటి ప్రాముఖ్యత' అనే అంశంపై వెబ్‌నార్‌ను నిర్వహించింది.

ఈ వెబ్‌నార్‌లో పాల్గొనేందుకు దాదాపు 20 దేశాలు అంగీకరించాయి. ఇందులో బంగ్లాదేశ్, భూటాన్, జపాన్, ఇరాన్, దక్షిణాఫ్రికా, వెనిజులా, ఇజ్రాయెల్, అమెరికా కూడా ఉన్నాయి. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ స్మారక దినోత్సవం నాడు స్మారక చిహ్నాల పరిరక్షణపై నిర్వహించిన మొట్టమొదటి గ్లోబల్ వెబ్‌నార్ ఇదే. వెబ్‌నార్ ప్రారంభోత్సవంలో సాంస్కృతిక, పర్యాటక మరియు ఈశాన్య వ్యవహారాల మంత్రి జి కిషన్ రెడ్డి (kishan reddy) సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి (meenakshi lekhi) .. సాంస్కృతిక , పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ (arjun ram meghwal).. ఎంపీ డాక్టర్ వినయ్ సహస్రబుద్ధే (vinay sahasrabuddhe) పాల్గొన్నారు. సాంస్కృతిక శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ప్రారంభోపన్యాసం చేశారు. 

భూటాన్‌కు చెందిన ప్రఖ్యాత కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ పెమా, ఈజిప్ట్‌కు చెందిన మహ్మద్ రౌఫ్ బద్రాన్, ఈక్వెడార్‌కు చెందిన డాక్టర్ మరియా, ఇరాన్‌కు చెందిన డాక్టర్ మహమ్మద్ హెక్మత్, మయన్మార్‌లోని అయుము కోనాసుకావా నుండి డాక్టర్ పైట్ ఫ్యో క్యావ్‌తో సహా పలువురు ప్రముఖ స్మారక నిపుణులు పాల్గొన్నారు. జాతీయ స్మారక చిహ్నాల ప్రాధికార సంస్థ చైర్మన్ తరుణ్ విజయ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత స్ఫూర్తితో ఇది చాలా విశిష్టమైన, అపూర్వమైన కార్యక్రమమని అన్నారు. ఈ సందర్భంగా భారతదేశంలో వారసత్వ సంపద పరిరక్షణకు చేస్తున్న కృషిని ప్రస్తావిస్తూ కేంద్రమంత్రులు.. వక్తలకు స్వాగతం పలికారు.

కొలంబియా నుండి Celina Rinkagems పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొలంబియాకు చెందిన Celina 45 వారసత్వ సంపద యొక్క ప్రణాళికను, దానిపై చేసిన వివరణాత్మక పనిని పేర్కొన్నారు. ప్రపంచ వారసత్వ సంపదను చిరకాలం ఎలా కాపాడుకోవాలో కూడా సూచనలు చేశారు. అదే సమయంలో, ఈజిప్టుకు చెందిన ప్రొఫెసర్ మహ్మద్ రౌఫ్ బద్రాన్.. ఈజిప్టు పిరమిడ్లు , ఇతర స్మారక చిహ్నాల పరిరక్షణ , కొత్త సాంకేతికతపై జరుగుతున్న పరిశోధనను ప్రస్తావించారు. ఈక్వెడార్‌కు చెందిన మారియా కూడా వారసత్వ సంపద గురించి చాలా ముఖ్యమైన అంశాలను తెలియజేశారు. గయానాకు చెందిన నిర్వాణ ప్రసాద్ పర్యాటక, సాంస్కృతిక రంగంలో భారత్‌ చేస్తున్న కృషిని ప్రస్తావించారు.

అనంతరం బంగ్లాదేశ్‌కు చెందిన ఆసియా పసిఫిక్ యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విభాగంలో ప్రొఫెసర్ అబూ సయీద్ అహ్మద్‌ను మాట్లాడాల్సిందిగా ఆహ్వానించారు. అయితే సాంకేతిక లోపం కారణంగా ఆయన మాటలు వినిపించలేదు. దాదాపు 15 నిమిషాల పాటు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. అదే సమయంలో, భూటాన్‌కు చెందిన మిస్ పెమా మాట్లాడుతూ.. భారత్- భూటాన్‌ల వారసత్వాన్ని కాపాడేందుకు చేస్తున్న కృషిని ప్రస్తావించారు. అలాగే దానిని ముందుకు తీసుకెళ్లడానికి రెండు దేశాలు నిరంతరం కృషి చేస్తున్నాయని చెప్పారు.