గర్భిణీ అని కూడా చూడకుండా.. మహిళ చేత గుంజీలు తీయించారు పంచాయితీ పెద్దలు. ఫలితంగా ఆమెకు అబార్షన్ అయ్యింది. ఈ దారుణ సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తూర్పు మిడ్నాపూర్ జిల్లా హల్దియా పరిధిలోని సూతాహాట్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గర్భిణీ మహిళ.. తమతో దురుసుగా ప్రవర్తించిందని.. కొందరు యువకులు పంచాయితీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. కాగా.. గ్రామపెద్దలు సభ ఏర్పాటు చేసి ఆమెకు శిక్ష విధించారు. చేసిన తప్పుకి శిక్షగాను వంద గుంజీలు తీయాలని ఆదేశించారు.

తాను గర్భవతిని అని మహిళ చెబుతున్నా.. గ్రామపెద్దలు వినిపించుకోలేదు.  దీంతో.. తప్పని పరిస్థితుల్లో ఆమె గుంజీలు తీయాల్సి వచ్చింది. దీంతో.. ఆమెకు అబార్షన్ అయ్యింది. దీంతో,... ఆమె కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.