Thiruvananthapuram: వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్న 15 నెలల బాలుడు నిర్వాణ్ కు వైద్య చికిత్స కోసం ఒక అపరిచిత వ్యక్తి రూ.11 కోట్లు విరాళంగా ఇచ్చారు. నిర్వాణ్ తల్లిదండ్రులు ప్రారంభించిన క్రౌడ్ ఫండింగ్ ఖాతాలో తన వివరాలు తెలియకుండా ఉండాలనీ, ఆ అజ్ఞాత వ్యక్తి ఈ మొత్తాన్ని జమ చేశాడు. ఈ ఘటన సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందని మరోసారి నిరూపించింది.
Anonymous donor pays ₹11.6 cr for child’s treatment: ఇటీవల కాలంలో వింత వ్యాధులు విజృంభిస్తున్నాయి. వాటిని నయం చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఇదే క్రమంలోనే ఒక చిన్నారి అరుదైన వ్యాధి బారినపడ్డాడు. అతనికి చికత్సకు కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులు దాతల నుంచి సాయం కోరుతున్న క్రమంలోనే ఓ గుర్తుతెలియని వ్యక్తి చిన్నారి చికిత్స కోసం రూ.11 కోట్లు సాయం అందించారు. ఏడాదిన్నర చిన్నారి నిర్వాణ్ కు గుర్తుతెలియని వ్యక్తి చేసిన ఈ సాయం సమాజంలో మానవత్వం ఇంకా సజీవంగానే ఉందని నిరూపించింది.
వివరాల్లోకెళ్తే.. వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్న 15 నెలల బాలుడు నిర్వాణ్ చికిత్స కోసం ఒక అపరిచితుడు రూ.11 కోట్లు విరాళంగా ఇచ్చారు. తల్లిదండ్రులు ప్రారంభించిన క్రౌడ్ ఫండింగ్ ఖాతాలో అజ్ఞాతంగా ఉండాలనుకునే వ్యక్తి ఈ మొత్తాన్ని జమ చేశాడు. కేరళలోని పాలక్కడ్ కు చెందిన సారంగ్ మీనన్, అదితి నాయర్ దంపతులకు నిర్వాణ్ అనే 15 నెలల కుమారుడు ఉన్నారు. అయితే, ఆ చిన్నారికి ఏడాది జనవరిలో ఎస్ఎంఏ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కావడంతో చికిత్సకు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. అంత స్థోమతలేని చిన్నారి తల్లిదండ్రులు చికిత్స కోసం సాయం చేయాలని దాతలను కోరారు. క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించారు.
గత కొన్ని రోజులుగా నిర్వాణకు సాయం చేయాలంటూ సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ వంతు సహాయం చేస్తూనే ఉన్నారు. కానీ చికిత్సకు అవసరమైన రూ.17 కోట్లకు చేరుకోవడం కష్టంగా మారింది. ఇలాంటి తరుణంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి చిన్నారి వైద్య సహాయం కింద రూ.11 కోట్లు నిర్వాణ్ కు పంపారు. అయితే ఆ వ్యక్తి ఎవరనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఇది పేరు, ప్రఖ్యాతుల కోసం చేయడం లేదన్నారు. బిడ్డ నయమైతే చాలని పేర్కొన్నారు. మరో రూ.80 లక్షలు వస్తే నిర్వాణ వైద్యానికి అవసరమైన మొత్తం పూర్తవుతుందని తల్లిదండ్రులు తెలిపారు.
సారంగ్ మీనన్, అదితి దంపతుల కుమారుడు నిర్వాణ్. ఆ చిన్న కుటుంబం సంతోషంగా జీవించింది. ఎన్నో అంచనాల మధ్య కొడుకు నిర్వాణ్ పుట్టాడు. పదమూడు నెలల తర్వాత నిర్వాణ ఆరోగ్యం క్షీణించిందని తెలిసింది. దీంతో తల్లిదండ్రులు కుమారుడి రక్తనమూనాన్ని తీసుకుని పరీక్షించారు. మూడు వారాల పరీక్ష తర్వాత, నిర్వాణ్ వెన్నెముక కండరాల క్షీణత అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. నిర్వాణ చికిత్స కోసం రూ.17.5 కోట్లు అవసరం అని వైద్యులు తెలిపారు. నిర్వాణకు రెండేళ్ల ముందే ఈ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ తర్వాతే అది ప్రభావవంతంగా ఉంటుందని తెలియజేశారు. జీవితాంతం పొదుపు చేసినా కుటుంబానికి అంత డబ్బు రాదని గ్రహించిన వారు మంచి నమ్మకంతో సహాయం కోసం క్రౌడ్ ఫండింగ్ కోస దరఖాస్తు చేసుకోగా, అది ఇప్పుడు ఫలించింది. ఓ గుర్తుతెలియని వ్యక్తి వైద్య సహాయం కింద రూ.11 కోట్లు నిర్వాన్ కు అందించారు.
అంత భారీ మొత్తాన్ని ఎవరు పంపించారో సారంగ్, అదితికి కూడా తెలియదు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా విదేశాల నుంచి సాయం అందింది. అజ్ఞాత వ్యక్తి నిర్వాణ్ కు సహాయం చేయడానికి ముందుకు వచ్చారనీ, ఆయన పేరు కోసమో, సెలబ్రిటీ కావాలని కోరుకోవడం లేదనీ, తన గురించి ఎటువంటి సమాచారం ఇవ్వవద్దని చెప్పారని సమాచారం. రెండు నెలల క్రితం నిర్వాణ్ కుటుంబ సభ్యులు సాయం కోసం అతడిని సంప్రదించారు. దీనికి ఏషియానెట్ న్యూస్ సహా మీడియా బాగా మద్దతు ఇచ్చింది. 2018 ఫిబ్రవరి 13 వరకు రూ.4 కోట్లు వసూలయ్యాయి. కానీ ఇప్పుడు ఆ విరాళాలు రూ.17.5 కోట్లకు చేరుకోవాలంటే మరో రూ.80 లక్షలు అవసరం. అయితే, తాము ఫార్మాస్యూటికల్ కంపెనీతో మాట్లాడామనీ, ఆలస్యంగా ఆ మొత్తాన్ని చెల్లించేందుకు అనుమతించాలని కోరామని, త్వరలోనే మందును డెలివరీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్టు చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపారు.
