రాజస్థాన్ లోని జైపూర్ సెంట్రల్ జైలులో దారుణం చోటుచేసుకుంది. పాకిస్థాన్ కి చెందిన ఓ ఖైదీని తోటి ఖైదీలు దారుణంగా హత్య చేశారు. రాళ్లతో కొట్టి మరీ చంపారు. పుల్వామా ఉగ్రదాడిలో 43మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో పాక్ ఖైదీని చంపేసినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

గుఢాచార్యం ఆరోపణలో భాగంగా షకీర్ అనే పాకిస్థానీ జైపూర్ లో శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా.. అతనిని తోటి ఖైదీలు దారుణంగా చంపేశారు. దీనిపై సమాచారం అందగానే సీనియర్ పోలీసు అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు జైలుకి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ముగ్గురు ఖైదీల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.