వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ సామికి పాకిస్తాన్ అరుదైన గౌరవం కల్పించింది. ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘నిషాన్ ఇ హైదర్‌’‌తో పాటు ఆ దేశ పౌరసత్వాన్ని అందించనున్నారు. భద్రతా కారణాలతో అంతర్జాతీయ క్రికెటర్లందరూ నిరాకరిస్తున్న వేళ సామి ధైర్యం చేసి 2017లో అక్కడ పీఎస్ఎల్ ఫైనల్ ఆడాడు.

Also Read:రాక్ స్టార్ జడేజా నా అభిమాన ఆటగాడు: హ్యాట్రిక్ హీరో అగర్

ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్‌ లీగ్‌లో పెషావర్ జల్మి జట్టుకు అతను సారథ్యం వహిస్తున్నాడు. తమ దేశంలో అంతర్జాతీయ క్రికెట్ పునరుజ్జీవం కోసం అతడు చేసిన సహాయానికి కృతజ్ఞతగా తాము ఇలా చేస్తున్నామని పీసీబీ శనివారం ప్రకటించింది.

పాక్ క్రికెట్‌కు డారెన్ సామి చేసిన సహయానికి కృతజ్ఞతగా అతడికి గౌరవ పౌరసత్వం అందించాలని తాము దేశాధ్యక్షుడికి విజ్ఞప్తి చేశామని పెషావర్ జల్మి జట్టు యజమాని జావెద్ ఆఫ్రిది తెలిపారు. మార్చి 23న జరిగే కార్యక్రమంలో పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ చేతుల మీదుగా డారెన్ సామికి నిషాన్ ఇ హైదర్‌తో పాటు గౌరవ పౌరసత్వాన్ని అందించనున్నారు.

Also Read:చాలా ఉన్నాయి, కానీ సచిన్ తో మాత్రం స్పెషల్ : ప్రజ్ఞాన్ ఓజా

2007 వన్డే ప్రపంచకప్‌ అనంతరం మాథ్యూ హేడేన్, హర్షల్ గిబ్స్‌లకు సెయింట్ కీట్స్ గౌరవ పౌరసత్వం అందించింది. ఆ తర్వాత ఇలాంటి ఘనత అందుకుంటున్న మూడో క్రికెటర్ సామినే. తన కెరీర్‌లో విండీస్‌కు రెండు టీ20 ప్రపంచకప్‌లు అందించాడు.