Asianet News TeluguAsianet News Telugu

రూటు మార్చిన పాకిస్తాన్: డ్రోన్‌ల ద్వారా ముష్కరులకు ఆయుధాలు

జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌పై రగిలిపోతున్న పాకిస్తాన్.. మన దేశంలో విధ్వంసం సృష్టించాలని ప్రణాళికలు రూపొందింస్తోంది. ఈ క్రమంలో ముష్కరుల కోసం ఆ దేశం డ్రోన్ ద్వారా ఆయుధాలను తరలిస్తున్నట్లుగా నిఘా వర్గాలు తెలిపాయి

Pakistan terror groups use drones for airdroping weapons in india
Author
Punjab, First Published Sep 25, 2019, 3:42 PM IST

జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌పై రగిలిపోతున్న పాకిస్తాన్.. మన దేశంలో విధ్వంసం సృష్టించాలని ప్రణాళికలు రూపొందింస్తోంది. ఈ క్రమంలో ముష్కరుల కోసం ఆ దేశం డ్రోన్ ద్వారా ఆయుధాలను తరలిస్తున్నట్లుగా నిఘా వర్గాలు తెలిపాయి.

సెప్టెంబర్ నెలలో ఓ డ్రోన్ పంజాబ్‌ రాష్ట్రంలోని పాక్ సరిహద్దుల్లో ఉన్న తరన్ తరాన్ జిల్లాలో ఎనిమిది సార్లు చక్కర్లు కొట్టిందని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. డ్రోన్ ద్వారా జారవిడిచిన వాటిలో ఏకే-47 తుపాకులు, మ్యాగజైన్లు, గ్రేనేడ్లు, శాటిలైట్ మొబైల్ ఫోన్లు, నకిలీ కరెన్సీ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించారు. వెంటనే ఈ సమస్యపై స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కేంద్ర హోంమంత్రిని కోరారు.

కాగా ఈ ఆయుధాలను మోసుకొచ్చిన డ్రోన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో వాటిని ఆపరేట్ చేసిన భూభాగంలోని వ్యక్తులు దానిని తగులబెట్టినట్లుగా పోలీసులు తెలిపారు.

మరోవైపు ఈ వార్తలపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఎలాంటి పరిస్ధితులనైనా ఎదుర్కోవడానికి సైన్యం సిద్ధంగా ఉందన్నారు. ఈ ఘటన వెనుక పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నామని పంజాబ్ డీజీపీ దినకర్ గుప్తా తెలిపారు.

ఖలిస్తాన్ తీవ్రవాదులను రెచ్చగొట్టి భారత సరిహద్దుల్లో విధ్వంసం సృష్టించాలని పాకిస్తాన్ ఈ పన్నాగం పన్నిందని డీజీపీ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios