Asianet News TeluguAsianet News Telugu

భారత్ పై పాకిస్తాన్ న్యూక్లియర్ దాడికి సిద్ధమైందా? యూఎస్ మాజీ విదేశాంగ మంత్రి వెల్లడించిన సంచలన విషయాలివే

భారత్ పై పాకిస్తాన్ న్యూక్లియర్ దాడికి సిద్ధమైందా? భారత్ విదేశాంగ శాఖనే ఈ విషయాన్ని తనకు తెలిపిందని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తన పుస్తకంలో వివరించారు. దీంతో తాము ఉభయ దేశాల నేతలతో మాట్లాడి న్యూక్లియర్ అటాక్ జరగకుండా అడ్డుకున్నామని తెలిపారు.
 

pakistan prepared for nuclear war india told me says US leader mike pompeo in his book
Author
First Published Jan 25, 2023, 2:15 PM IST

న్యూఢిల్లీ: అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో రాసిన నెవర్ గీవ్ యాన్ ఇంచ్ అనే పుస్తకం మంగళవారం పబ్లిష్ అయింది. ఈ పుస్తకంలో ఆయన కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. అదీ మన దేశం, పాకిస్తాన్‌కు మధ్య న్యూక్లియర్ దాడి జరిగేదని పేర్కొనడం చర్చనీయాంశమైంది. జమ్ము కశ్మీర్ పుల్వామాలో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ టెర్రరిస్టు భారత ఆర్మీని టార్గెట్ చేసుకుని ఆత్మాహుతికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ పుల్వామా ఉగ్రదాడిలోల 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత భారత ప్రభుత్వం ఆ ఉగ్రవాద సంస్థ శిబిరాలను నాశనం చేయడానికి వైమానిక దాడి చేసింది. పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి బాలాకోట్ స్ట్రైక్ చేసింది. ఇందులో భారత యుద్ధ విమానాన్ని అడ్డుకోవడానికి పాక్ యుద్ధ విమానాలు కూడా వచ్చాయి. పాక్ విమానాలతో పోరాడుతూ భారత యుద్ధ విమానం కూడా ఆ దేశంలోకి వెళ్లింది. అప్పుడే వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ పాకిస్తాన్ సైన్యానికి చిక్కారు. ఇదంతా బయటకు కనిపించిందే. కానీ, ఈ బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత పాకిస్తాన్ దేశం.. భారత్ పై న్యూక్లియర్ దాడికి ప్రయత్నించిందనే వార్త తనకు వచ్చిందని అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తన పుస్తకంలో పేర్కొన్నారు.

2019 ఫిబ్రవరిలో తాను అమెరికా, ఉత్తర కొరియా సదస్సు కోసం హనోయి‌లో ఉన్నారని, ఆ సమయంలోనే తనకు ఈ వార్త అందిందని మైక్ పాంపియో తెలిపారు. తన టీమ్ ఆ రాత్రంతా పని చేసి భారత్, పాకిస్తాన్‌లు అణుయయుద్ధానికి వెళ్లకుండా కన్విన్స్ చేసిందని వివరించారు. 

‘2019 ఫిబ్రవరిలో ఇండియా, పాకిస్తాన్‌ ప్రత్యర్థి దేశాలు న్యూక్లియర్ దాడులకు ఎంత సమీపంగా వెళ్లాయో ప్రపంచానికి అంతగా తెలుసు అని అనుకోవట్లేదు. ఈ రెండు దేశాలు న్యూక్లియర్ దాడికి చాలా సమీపంగా వెళ్లాయని మాత్రం నాకు తెలుసు. అంతకు మించి స్పష్టంగా తెలియదు’ అని వివరించారు. ‘వియత్నాం హనోయిలో నేను ఉన్న ఆ రాత్రిని ఎప్పటికి మరువలేను. ఉత్తర కొరియాతోనే అణ్వాయుధాలపై చర్చలు సరిపోవన్నట్టు, జమ్ము కశ్మీర్ సరిహద్దు కేంద్రంగా దశాబ్దాల వివాదంలో భాగంగా భారత్, పాకిస్తాన్‌లు హెచ్చరికలు చేసుకున్నాయి’ అని వివరించారు.

Also Read: కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు వీర్ చక్ర అవార్డు అందించడంపై పాకిస్తాన్ రియాక్షన్

‘కశ్మీర్‌లో ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌ భూభాగంలోని టెర్రరిస్టులకు వ్యతిరేకంగా భారత్ వైమానిక దాడులతో స్పందించింది. పాకిస్తానీలు భారత విమానాన్ని నేలకూల్చి ఇండియన్ పైలట్‌ను ఖైదీగా తీసుకున్నారు’ అని తెలిపారు’ అని పేర్కొన్నారు. ‘హనోయిలో నేను భారత విదేశాంగ మంత్రి (సుష్మా స్వరాజ్) కాల్ స్వీకరించి మాట్లాడాను. భారత్ పై పాకిస్తాన్‌ ప్రభుత్వ న్యూక్లియర్ వెపన్‌తో అటాక్ చేయడానికి సిద్ధమైనట్టు వారు చెప్పారు. అంతేకాదు, భారత్ కూడా అందుకు తగ్గట్టుగా ఎదుర్కోవడానికి సిద్ధం అవుతున్నట్టు వారు వివరించారు. మీరేమీ చేయవద్దని, ఒక్క నిమిషం సమయం ఇవ్వాలని, తాము పరిస్థితులను చక్కదిద్దుతామని చెప్పాను’ అని వివరించారు.

‘నేను అంబాసిడర్ బాల్టన్‌తో మాట్లాడాను. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖామర్ జావేద్ బజ్వాను కూడా రీచ్ అయ్యాను. భారతీయులు నాకు చెప్పిన విషయాన్ని అతనికి చెప్పాను. అది వాస్తవం కాదని బజ్వా చెప్పాడు’ అని పాంపియో పేర్కొన్నారు. న్యూక్లియర్ దాడి జరగకుండా అడ్డుకోవడానికి తమకు కొన్ని గంటల సమయం పట్టిందని, తన టీమ్ మంచి పని చేసిపెట్టిందని, అటు న్యూ ఢిల్లీని, ఇటు ఇస్లామాబాద్‌ను అణు దాడి నుంచి వెనక్కి వెళ్లేలా ఒప్పించగలిగిందని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios