ప్రధాని నరేంద్ర మోడీతో తాను టీవీలో చర్చించాలని భావిస్తున్నట్టు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. రష్యా టుడే మీడియా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ.. ఈ చర్చ ద్వారా భారత్, పాకిస్తాన్ మధ్య విభేదాలు తొలగిపోతే.. వంద కోట్లకుపైగా ప్రజలకు లబ్ది చేకూరుతుందని వివరించారు. 

న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్(Pakistan PM Imran Khan) ఓ రష్యా మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi)తో తాను టీవీ డిబేట్(TV Debate) చేయాలని అనుకుంటున్నట్టు తెలిపారు. తద్వార రెండు దేశాల మధ్య సమస్యలను రూపుమాపుకోవడానికి వీలు ఏర్పడుతుందని అన్నారు. స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి భారత్, పాకిస్తాన్ దేశాలు స్నేహపూరిత సంబంధాలను కలిగి లేదు. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ కఠినంగానే కొనసాగాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మూడు సార్లు ఈ దేశాల మధ్య యుద్ధాలు(Wars) జరిగాయి.

టీవీలో తాను నరేంద్ర మోడీతో డిబేట్ చేయాలని భావిస్తున్నట్టు ఇమ్రాన్ ఖాన్ ఈ రోజు రష్యా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఈ చర్చ ద్వారా రెండు దేశాల మధ్య సమస్యలు, విభేదాలు తొలగిపోతే.. భారత ఉపఖండంలోని వంద కోట్లకుపైగా ప్రజలకు లబ్ది చేకూరుతుందని వివరించారు. కాగా, ఈ విషయంపై విదేశాంగ వ్యవహారాలపై ఇంకా స్పందించలేదు.

ఉగ్రవాదం.. చర్చలు రెండూ ఏకకాలంలో జరగవని ఇండియా ఇటీవలే పాకిస్తాన్‌కు స్పష్టం చేసింది. ఉగ్రవాద సంస్థలపై ఉగ్రవాదులపై దాడులు చేయాలని పాకిస్తాన్‌ను డిదమాండ్ చేసింది. అందులో కొందరు ఉగ్రవాదులను అమెరికా గుర్తించిందని వివరించింది.

ఓ సందర్భంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాకిస్తాన్ వెళ్లారు. పాకిస్తాన్‌లోనే ఆయనలోని ఈ యుక్తులను వెల్లడించే ఓ ఘటన జరిగింది. ఆ ఘటనను ఇప్పటికీ చాలా మంది కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. అది 1999 మార్చి 16వ తేదీన జరిగింది. ఆయన పాకిస్తాన్‌లోని గవర్నర్ హౌజ్ ప్రసంగించారు. ఆ సమయంలో ఓ మహిళా రిపోర్టర్ ఆశ్చర్యకర, అనూహ్యమైన ప్రశ్న వేసింది. అందుకు అటల్ బిహార్ వాజయ్‌పేయి దీటైన సమాధానం చెప్పి సభికులందరినీ కొంత సేపు దిగ్భ్రమలో ముంచారు.

అటల్ బిహార్ వాజ్‌పేయి గారు.. మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? అని పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళా విలేకరి(Female Journalist) ప్రశ్నించారు. తాను వాజ్‌పేయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నదని అన్నారు. అయితే, అందుకు ఒక షరతు పెట్టింది. తాను వాజ్‌పేయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ఒక తంతులో భాగంగా ముఖాన్ని చూపించడానికి కట్నంగా కశ్మీర్‌(Kashmir)ను పాకిస్తాన్‌కు ఇస్తారా? అని అడిగారు. ఈ ప్రశ్నతో హాల్ అంతా ఖంగు తిన్నది. ఇలాంటి ప్రశ్నను ఎవరూ ఊహించలేదు. భారత్ నుంచి పాకిస్తాన్ వేరుపడ్డప్పటి నుంచి కశ్మీర్ వివాదం కొనసాగుతూనే ఉన్నది. రెండు దేశాల మధ్య ఘర్షణలకు, వైరానికి కేంద్రబిందువుగా కశ్మీరే ఉన్నది. అలాంటి కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు ఇచ్చేస్తారా? అని ప్రశ్నించడం సభలో వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేసింది. అయితే, అటల్ బిహార్ వాజ్‌పేయి ధైర్యం, వాక్చాతుర్యం ఇక్కడే మరోసారి బయటికి వచ్చింది.

సరే.. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ. కానీ, నాకు కూడా ఒక షరతు ఉన్నది. నిన్ను పెళ్లి చేసుకున్నందుకు వరకట్నం(Dowry)గా మొత్తం పాకిస్తాన్‌ను ఇచ్చేస్తారా? అని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్ నడిబొడ్డులో ఆ దేశాన్ని ఇచ్చేస్తారా? అని ఆయన అడగడం మరోసారి సభికులను షాక్‌కు గురి చేసింది. ఈ వ్యాఖ్యలతో ఆ మహిళా జర్నలిస్టు గొంతులో వెలక్కాయ పడినట్టయింది.