ఇండియాలోని కుటుంబాన్ని కలిసిన పాకిస్తాన్ బౌలర్ హసన్ అలీ భార్య సామియా
పాకిస్తాన్ పేసర్ హసన్ అలీ భార్య సామియా అర్జూకు హర్యానాలోని తన కుటుంబాన్ని కలుసుకోవడానికి వరల్డ్ కప్ ఒక అరుదైన అవకాశాన్ని కల్పించింది. పాకిస్తాన్ టీమ్ ఇండియాకు రాగానే ఆమె గురుగ్రామ్‌లోని తన పేరెంట్స్ వద్దకు బిడ్డతో కలిసి చేరుకుంది.
న్యూఢిల్లీ: క్రికెట్ వరల్డ్ కప్ పాకిస్తాన్ బౌలర్ హసన్ అలీ భార్య సామియా అర్జూకు ఒక అరుదైన అవకాశాన్ని కల్పించింది. హర్యానాలోని కుటుంబాన్ని ఆమె కలుసుకునేందుకు అవకాశమిచ్చింది. దుబాయ్‌కి ఉద్యోగనిమిత్తం వెళ్లి పెళ్లి చేసుకుని, పాకిస్తాన్‌లో బిడ్డకు జన్మనిచ్చినప్పటి నుంచి ఆమె ఇండియాకు మళ్లీ రాలేదు. కుటుంబంతో గడపలేదు.
సామియా అర్జూ హర్యానాలో నూహ్ జిల్లాలోని చందైని గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి లియాఖత్ ఖాన్ కూతురు. ఆమె దుబాయ్‌లో ఎయిర్ ఎమిరేట్స్‌లో ఎరోనాటికల్ ఇంజనీరింగ్‌గా పని చేస్తున్నారు. పాకిస్తాన్ టీమ్ వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం ఇండియాకు వచ్చింది. ఇందులో హసన్ అలీ తన భార్య, బిడ్డతో కలిసి ఇండియాకు వచ్చారు. దీంతో సామియా, వారి రెండేళ్ల హెలెనా హాసన్ కూడా తొలిసారి ఇండియాకు రావడానికి అవకాశం ఏర్పడింది.
హసన్ అలీ టీమ్‌తో అహ్మదాబాద్‌లో ఉండగా, సామియా ఒక రోజు క్రితం ఢిల్లీ నుంచి మేవాట్‌కు వెళ్లినట్టు తెలిసింది. పాకిస్తాన్ నేషనల్ టీమ్‌లో హసన్ అలీ పేరు చేరినప్పటి నుంచి సామియా అర్జూ పాకిస్తాన్ టీమ్ ఎప్పుడు ఇండియా వస్తుందా? అని లియాఖత్ ఖాన్ కుటుంబం రోజులు లెక్కిస్తున్నది.
సామియా అర్జూ గురుగ్రామ్‌లో తల్లిదండ్రులతో అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నట్టు తెలిసింది. కాగా, లియాఖత్ ఖాన్ మిగిలిన కుటుంబం అంతా చందైనిలోనే ఉంటున్నది. వారు సామియా అర్జూ కోసం ఎదురుచూస్తున్నారు. సామియా అర్జూ నిన్న రాత్రి గురుగ్రామ్‌లోని తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నట్టు సోదరుడు అక్బర్ అలీ తెలిపాడు. వరల్డ్ కప్ సిరీస్ అయిపోయాక హసన్ అలీ లియాఖత్ ఖాన్ కుటుంబాన్ని కలుసుకోబోతున్నట్టు సమాచారం.
Also Read: హాస్పిటల్ ఐసీయూల్లో భజనలు, పేషెంట్లకు చికిత్స అందించడంలో వైద్యులకు సహాయంగా..
సామియా అర్జూ 2019 ఆగస్టు 20వ తేదీన హసన్ అలీని దుబాయ్‌లోని ఓ హోటల్‌లో పెళ్లి చేసుకుంది. ఆమె ఎరోనాటికల్‌లో బీటెక్ చేసింది. ఆమె జెట్ ఎయిర్‌వేస్‌లో కూడా పని చేసింది.
సామియా కుటుంబానికి పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ మాజీ ఎంపీ, పాకిస్తాన్ రైల్వే బోర్డ్ చైర్మన్ సర్దార్ తుఫాల్ అలియాస్ ఖాన్ బహదూర్ తన తండ్రి సోదరులని లియాఖత్ ఖాన్ తెలిపాడు. సామియా పెళ్లిని ఖరారు చేయడంలో పాకిస్తాన్‌లోని తమ కుటుంబ బంధువులు సహాయపడ్డారని వివరించాడు. హసన్ అలీ, సామియా అర్జూలకు హెలెనా 2021 ఏప్రిల్ 6వ తేదీన జన్మించింది.
--- యూనస్ అల్వీ