పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశానికి సైన్యం గట్టి గుణపాఠం చెప్పాలని జాతి మొత్తం రగిలిపోతోంది. 

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశానికి సైన్యం గట్టి గుణపాఠం చెప్పాలని జాతి మొత్తం రగిలిపోతోంది. ఇఫ్పటికే పాక్‌ను దౌత్యపరంగా ఒంటరిని చేసిన భారత్.. వాణిజ్య సంబంధాలను సైతం తెంచుకుంది.

తాజాగా రాజస్థాన్‌లోని బికనేర్ జిల్లా కలెక్టర్.. పాక్ జాతీయలు 48 గంటల్లోగా నగరాన్ని విడిచి వెళ్లాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా హోటళ్లు, లాడ్జిల్లోకి పాకిస్తానీయులను అనుమతించొద్దని ఆదేశించారు.

పాకిస్తానీయులకు ఉద్యోగాలు ఇవ్వడం, లేదా వారితో ప్రత్యక్ష లేదా పరోక్ష వ్యాపార సంబంధాలు పెట్టుకోకూడదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ రిజిస్ట్రేషన్ ఉణ్న సిమ్ కార్డులను కూడా వినియోగించరాదని , ఈ ఆదేశాలు రెండు నెలల పాటు అమల్లో ఉంటాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.