న్యూఢిల్లీ:పాకిస్తాన్ డిప్యూటీ డిప్యూటీ హై కమిషనర్ సయ్యద్ హైదర్ షా‌కు భారత్ బుధవారం నాడుసమన్లు జారీ చేసింది.

భారత ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ ‌ను పాక్ ఆర్మీ తమ బందీగా ఉన్నట్టుగా ప్రకటించింది. ఎల్ఓసీ వద్ద చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో పాక్ డిప్యూటీ  హై కమిషనర్‌కు సమన్లు జారీ చేయడం  ప్రాధాన్యత కలిగింది.

భారత్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన పైలట్ అభినందన్‌ను అదుపులోకి తీసుకోవడంపై కూడ భారత విదేశాంగ శాఖ పాక్ డిప్యూటీ హై కమిషనర్‌ను ప్రశ్పించే అవకాశం ఉంది. పాక్ తీరుపై భారత్ తన నిరసనను వ్యక్తం చేసింది.ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయడాన్ని మిలటరీ చర్యగా ఎలా చూస్తారని ఇండియా ప్రశ్నిస్తోంది.