Asianet News TeluguAsianet News Telugu

కిషన్ రెడ్డి వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన పాకిస్తాన్ హ్యాకర్లు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్‌ను పాకిస్తాన్‌కు చెందిన కొందరు హ్యాకర్లు హ్యాక్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కిషన్ రెడ్డి వెబ్‌సైట్‌ హ్యాక్‌కు గురింది

Pakistan Based Hackers Target Personal Website Of union minister Kishan Reddy
Author
New Delhi, First Published Aug 25, 2020, 7:34 PM IST

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్‌ను పాకిస్తాన్‌కు చెందిన కొందరు హ్యాకర్లు హ్యాక్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కిషన్ రెడ్డి వెబ్‌సైట్‌ హ్యాక్‌కు గురింది.

అందులో పాకిస్తాన్  అనుకూల నినాదాలు పెట్టడంతో పాటు భారత ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు సందేశాలు పెట్టారు. వెబ్‌సైట్ హ్యాకైన విషయాన్ని హైదరాబాద్‌లోని కిషన్ రెడ్డి కార్యాలయం ధ్రువీకరించింది.

హ్యాకింగ్  అనంతరం ఆయన వెబ్‌సైట్‌ను ఓపెన్ చేస్తే తాత్కాలికంగా అందుబాటులో లేదనే సందేశం వస్తోంది. మరోవైపు కిషన్ రెడ్డి వెబ్‌సైట్‌లో ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని అధికారులు వెల్లడించారు.

ఆయన వ్యక్తిగత వివరాలతో పాటు రోజువారీగా ఆయన పాల్గొంటున్న కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉందన్నారు. ఇవన్నీ పబ్లిక్ డొమైన్‌లో ఉన్నవేనని చెప్పారు. కాగా సాంకేతిక నిపుణుల సాయంతో వెబ్‌సైట్‌ను హ్యాకింగ్ బారి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios