పాకిస్తాన్ మరోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. గురువారం ఉదయం మరోసారి కాల్పులకు తెగబడింది. కాగా...  పాక్ కాల్పులను భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా మాన్‌కోటి నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ సైనికులు గురువారం ఉదయం కాల్పులు జరిపారు. గురువారం ఉదయం 7.15 గంటలకు పాక్ సైనికులు షెల్లింగ్స్, మోర్టార్లతో ఫూంచ్ సెక్టారు సరిహద్దుల్లో కాల్పులు జరిపారు. భారత సైనికులు పాక్ సైనికుల కాల్పులను తిప్పికొట్టారు. భారత సైనికుల ఎదురు కాల్పులతో పాక్ సైనికులు పారిపోయారు.