Nupur Sharma: బహిష్కృత బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను చంపేందుకు అంతర్జాతీయంగా భారీ కుట్ర జ‌రుగుతోంది.  రాజస్థాన్‌లోని శ్రీ గంగా నగర్ జిల్లాలో ఓ అనుమాతుడిని అరెస్టు చేశారు. అలాగే.. బీహార్ రాజధాని పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ టెర్రర్ మాడ్యూల్ కేసులో అరెస్టయిన మహ్మద్ అథర్ పర్వేజ్ కూడా సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించారు. 

Nupur Sharma: బహిష్కృత బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను చంపేందుకు అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌కు వచ్చిన పాకిస్థాన్ జాతీయుడిని రాజస్థాన్‌లోని శ్రీ గంగా నగర్ జిల్లాలో అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి), ఇతర ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సంయుక్త బృందం ఆ నిందితుడిని విచారిస్తోంది.

జులై 16న రాత్రి 11 గంటల సమయంలో హిందూమల్‌కోట్ సరిహద్దు ఔట్‌పోస్టు దగ్గర నుంచి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సీనియర్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) అధికారి తెలిపారు. అనుమానాస్పద స్థితిలో ఉన్న అత‌డిని పెట్రోలింగ్ బృందం గుర్తించి, వెంటనే అదుపులోకి తీసుకుని, అత‌డిని త‌నిఖీ చేయ‌గా.. అతని బ్యాగ్‌లో 11 అంగుళాల పొడవైన కత్తి, మతపరమైన పుస్తకాలు, బట్టలు, ఆహారప‌దార్థాల‌ను గుర్తించిన‌ట్టు తెలిపారు. నిందితుడిని పాకిస్తాన్‌లోని ఉత్తర పంజాబ్‌లో ఉన్న మండి బహౌద్దీన్ నగరానికి చెందిన రిజ్వాన్ అష్రఫ్‌గా గుర్తించారు.

ప్రాథమిక దర్యాప్తులో.. ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలపై నూపుర్ శర్మను హతమార్చేందుకు తాను సరిహద్దు దాటినట్లు అనుమానితుడు తెలిపాడని అధికారులు తెలిపారు. అతను తన ప్రణాళికను అమలు చేయడానికి ముందు అజ్మీర్ దర్గాను సందర్శించాలని అనుకున్నాడు.

సీనియర్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) అధికారి మాట్లాడుతూ.. "మేము తదుపరి విచారణ కోసం అతన్ని స్థానిక పోలీసులకు అప్పగించామనీ, అతన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని తెలిపారు. ఈ క్ర‌మంలో అతన్ని ఎనిమిది రోజుల పోలీసు కస్టడీకి పంపారనీ, అతని గురించి సంబంధిత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు సమాచారం ఇచ్చామని చెప్పారు.


మ‌రోవైపు.. బీహార్ రాజధాని పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ టెర్రర్ మాడ్యూల్ కేసులో అరెస్టయిన మహ్మద్ అథర్ పర్వేజ్ సెల్‌ఫోన్ నుండి బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చిరునామా కనుగొనబడింది. అధికారుల స‌మాచారం ప్రకారం.. NIA, IB దర్యాప్తులో.. ఢిల్లీలోని నుపుర్ శర్మ నివాస చిరునామా అథర్ పర్వేజ్ మొబైల్ లో క‌నుగొన్నారు. నిందితుడు పర్వేజ్ విచారించ‌గా.. ఆ చిరునామా త‌న‌ గ్రూప్‌లో వ‌చ్చినట్టు చెప్పాడు. ప్రవక్త మొహమ్మద్‌పై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన నూపుర్ శర్మను అథర్ పర్వేజ్, అతని బృందం లక్ష్యంగా చేసుకుంద‌ని ద‌ర్యాప్తులో తెలింది. ఇంతేకాకుండా.. పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి

ప్ర‌స్తుతం ఫుల్వారీ షరీఫ్ టెర్రర్ మాడ్యూల్ కేసులో అరెస్ట్ అయిన అథర్ పర్వేజ్, అర్మాన్ మాలిక్‌లను పాట్నా పోలీసులు విచారిస్తున్నారు. ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు. పోలీసుల ఎదుట మరిన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. బీహార్‌లో 12 వేల మందికి పైగా ముస్లిం యువకులకు ఆయుధాలు వాడేందుకు పీఎఫ్‌ఐ శిక్షణ ఇచ్చిందని, బీహార్‌లోని 13 జిల్లాల్లో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేయాలనే చర్చ తెరపైకి వచ్చిందని తెలిపారు.