Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్ నుంచి దూసుకొచ్చిన డ్రోన్ .. కాల్చివేసిన భద్రతాబలగాలు.. 

పాకిస్థాన్ మరోసారి భారత్‌పై డ్రోన్‌ దాడి చేయడానికి కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. సరిహద్దు రాష్ట్రం పంజాబ్ లోని గురుదాస్‌పూర్ జిల్లా మెట్ల గ్రామ సమీపంలో అర్ధరాత్రి 1 గంట సమయంలో ఓ డ్రోన్ ను బీఎస్ఎఫ్ బలగాలు అడ్డుకున్నాయి.  

Pak Drone Carrying AK Rifle, Bullets Shot Down Along Punjab Border
Author
First Published Mar 11, 2023, 12:19 AM IST

పాకిస్థాన్ మరోసారి భారత్‌పై డ్రోన్‌ దాడి చేసేందుకు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. సరిహద్దుకు సమీపంలో ఉన్న పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతా బలగాలు (BSF) పాక్‌కు చెందిన ఓ డ్రోన్‌ను గుర్తించారు. గురుదాస్‌పూర్ జిల్లా మెట్ల గ్రామ సమీపంలో గుర్తించినట్టు వెల్లడించారు. అయితే ఆ డ్రోన్‌ చైనాకు చెందిందని అధికారులు అనుమానాలూ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విచారణ మొదలు పెట్టారు. ఈ డ్రోన్ దొరికిన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. ఈ మధ్యే పాకిస్థాన్‌కు చెందిన ఓ డ్రోన్‌ను గుర్తించి భద్రత సిబ్బంది దాన్ని కాల్చేశారు.

వివరాల్లోకెళ్తే.. పంజాబ్‌లోని డేరా బాబా నానక్‌లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) BOP మెట్ల సమీపంలో గురువారం అర్థరాత్రి పాకిస్తాన్ డ్రోన్‌ను గుర్తించింది. ఈ ఘటన తరువాత బీఎస్ఎఫ్ జవాన్లు, బటాలా పోలీసులు సంయుక్తంగా రాత్రిపూట సోదాలు నిర్వహించారు.  మరోవైపు శుక్రవారం కూడా బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సమయంలో గొప్ప విజయం సాధించింది. 

థానా కోట్లి సూరత్ మల్హికి చెందిన నాభినగర్ గ్రామ పొలాల్లో డ్రోన్ పడి ఉంది. అంతే కాకుండా ఆయుధాలు కూడా దొరికాయి. ఈ విషయమై బటాలా ఎస్పీ గుర్‌ప్రీత్ సింగ్ గిల్ మాట్లాడుతూ.. గురువారం అర్థరాత్రి బీఎస్‌ఎఫ్ మెట్ల పోస్ట్ వద్ద డ్రోన్ కనిపించిందని తెలిపారు. దీని తర్వాత.. బటాలాలోని డేరా బాబా నానక్‌కు చెందిన పోలీసులు,బిఎస్‌ఎఫ్ రాత్రి నుండి సెర్చ్ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉన్నారు.

సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా, శుక్రవారం మధ్యాహ్నం కోట్లి సూరత్ మల్హిలోని నభీపూర్ గ్రామంలోని పొలాల్లో పెద్ద పాకిస్తాన్ డ్రోన్ కనుగొనబడింది. దీంతో పాటు ఒక ఏకే-47, రెండు మ్యాగజైన్‌లు, 40 కాట్రిడ్జ్‌లు కూడా లభ్యమయ్యాయి. ఈ డ్రోన్‌పై పొలం యజమాని స్వయంగా బటాలా పోలీసులకు, బీఎస్‌ఎఫ్‌కు సమాచారం అందించాడు. డ్రోన్, ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి తదుపరి చర్యలు ప్రారంభించినట్లు ఎస్పీ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios