న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం  పద్మ అవార్డులను సోమవారం నాడు ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని పద్మ అవార్డుల జాబితాను కేంద్రం సోమవారం నాడు పద్మ అవార్డులు ప్రకటించింది.

119 మందికి పద్మ పురస్కారాలను  కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏడుగురికి పద్మ విభూషణ్,10 మందికి పద్మ భూషణ్ పురస్కారాలు ప్రకటించింది. 102 మందికి పద్మశ్రీ పురస్కారాల ప్రకటించింది.

 

ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. పీఎంవో మాజీ కార్యదర్శి నృపేంద్ర మిశ్రాకు పద్మభూషణ్పాసవాన్, తరుణ్ గొగోయ్ కు పద్మభూషణ్ పురస్కారాలను ప్రకటించింది.మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు పద్మభూషణ్, గుజరాత్ బీజేపీ నేత, మాజీ సీఎం కేశూభాయ్ పటేల్ కు పద్మభూషణ్ ను కేంద్రం ప్రకటించింది. 

ఏపీకి చెందిన అన్నవరపు రామస్వామికి పద్మశ్రీ(కళలు), ఏపీకి చెందిన అసవాది ప్రకాశ్ రావుకు పద్మశ్రీ(సాహిత్యం), 
ఏపీకి చెందిన నిడుమోలు సుమతికి పద్మశ్రీ(కళలు)  కేంద్రం ప్రతిష్టాత్మక అవార్డులు ప్రకటించింది.

పద్మ విభూషణ్ అవార్డులు
 షినాజో అబే 
ఎస్పీ బాలసుబ్రమణ్యం
డాక్టర్ బెల్లె మోనప్ప హెగ్డే
మౌలానా వహీదుద్దీన్ ఖాన్
బీబీలాల్
సుదర్శన్ సాహూ

పద్మ భూషణ్ అవార్డులు
కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర
తరుణ్ గొగోయ్
చంద్రశేఖఱ్ కంబర
సుమిత్రా మహాజన్
నృపేంద్ర మిశ్రా
రామ్ విలాస్ పాశ్వాన్
కేశుబాయ్ పటేల్
కల్బే సాదిఖ్
రజనీకాంత్ దేవిదాస్ 
తర్లోచాన్ సింగ్