Asianet News TeluguAsianet News Telugu

యూపీలో వరి ధాన్యం కొనుగోలు షురూ... మద్దతు ధర ఎంతంటే...

పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో అక్టోబర్ 1 నుంచి వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం కానుంది. ఈ మేరకు 4000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.  

Paddy Procurement in Uttar Pradesh Begins Tomorrow, 4000 Procurement Centers Set Up akp
Author
First Published Oct 1, 2024, 12:20 AM IST | Last Updated Oct 1, 2024, 12:20 AM IST

లక్నో : పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో అక్టోబర్ 1 నుంచి వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం కానుంది. లక్నో డివిజన్‌లోని జిల్లాల్లో వేర్వేరు తేదీల్లో కొనుగోళ్లు జరుగుతాయి. హర్దోయ్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్‌లలో అక్టోబర్ 1 నుంచి... లక్నో, రాయ్‌బరేలీ, ఉన్నావో జిల్లాల్లో నవంబర్ 1 నుంచి కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కానుంది. వరి ధాన్యం క్వింటాల్‌కు కనిష్ట మద్దతు ధర రూ.2300, గ్రేడ్-ఎ వరి ధాన్యం క్వింటాల్‌కు రూ.2320గా నిర్ణయించారు.

రైతులకు లోడింగ్, క్లీనింగ్, రవాణా ఖర్చుల నిమిత్తం క్వింటాల్‌కు రూ.20 చొప్పున పరిహారం అందిస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఫుడ్ ఆండ్ లాజిస్టిక్స్ శాఖ, ఇతర కొనుగోలు సంస్థలు మొత్తం 4000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాయి. రైతులకు 48 గంటల్లోపు చెల్లింపులు చేయాలని యోగి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

30 రోజుల్లో దాదాపు 32 వేల మంది రైతులు నమోదు

ఫుడ్ ఆండ్ జిస్టిక్స్ శాఖ సెప్టెంబర్ 1 నుంచి వరి ధాన్యం కొనుగోలు కోసం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పటివరకు 30 రోజుల్లో రాష్ట్రంలో దాదాపు 32 వేల మంది రైతులు నమోదు చేసుకున్నారు. వరి ధాన్యం క్వింటాల్‌కు కనిష్ట మద్దతు ధర రూ.2300, గ్రేడ్-ఎ వరి ధాన్యం క్వింటాల్‌కు రూ.2320గా నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఫుడ్ ఆండ్ లాజిస్టిక్స్ శాఖ, ఇతర కొనుగోలు సంస్థలు మొత్తం 4000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాయి.

వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం.. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2024-25లో 61.24 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. ఈ ఏడాది 265.54 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. హెక్టారుకు సగటు దిగుబడి 43.36 క్వింటాళ్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

 పశ్చిమ ఉత్తరప్రదేశ్ జిల్లాల్లో అక్టోబర్ 1 నుంచి వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై.. జనవరి 31 వరకు కొనసాగుతాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని మేరట్, సహారన్‌పూర్, మురాదాబాద్, బరేలీ, ఆగ్రా, అలీగఢ్, జాన్సీ డివిజన్లలో ఈ కొనుగోళ్లు జరుగుతాయి. అలాగే లక్నో డివిజన్‌లోని హర్దోయ్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్ జిల్లాల్లో కూడా ఇదే సమయంలో వరి ధాన్యం కొనుగోళ్లు చేపడతారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios