Mahatma Favourite Hymn:   ఈ యేడాది రిప‌బ్లిక్ డే ‘బీటింగ్ రీట్రిట్ కార్యక్రమం’లో ఆల‌పించే.. ‘అబైడ్ విత్ మి’ అనే గీతాన్ని తొలగించడం పట్ల కేంద్ర ప్రభుత్వంపై పలువురు విపక్ష పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీకి ఇష్టమైన ఈ గీతాన్ని తొలగించడం చాలా బాధాకరమని మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు.  

Mahatma Favourite Hymn: రిప‌బ్లిక్ డే దగ్గర ప‌డుతున్న కొద్దీ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలను తీసుకుంటుంది. రిప‌బ్లిక్ డే సందర్భంగా ప్రదర్శించే కొన్ని రాష్ట్రాల శకటాలను కేంద్రం తిరస్కరించ‌డంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇదిలా ఉంటే.. తాజాగా మోడీ స‌ర్కార్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రిప‌బ్లిక్ డే ముగింపు వేడుకల్లో భాగంగా ప్ర‌ద‌ర్శించే.. బీటింగ్ రీట్రిట్‌లో ఒక ఫేమస్ బీట్‌ను తొలగించారు. అదీ కూడా జాతిపిత మహాత్మా గాంధీకి ఇష్టమైన అబిడ్ విత్ మి” అనే బీట్ ను తొలగించారు. స్వాత్రంత్య వ‌చ్చిన‌ప్పటి నుంచి ఈ బీట్ నుంచి సైనిక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇప్పుడు దీని స్థానంలో…మేరే వతన్‌ కే లోగోన్‌…అనే పాటను చేర్చారు.

ఈ నిర్ణ‌యంపై పలువురు విపక్ష పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీటింగ్ రిట్రీట్ వేడుక నుండి మహాత్మాగాంధీకి ఇష్టమైన 'అబిడ్ విత్ మి' అనే కీర్తనను తొలగించాలనే కేంద్రం నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విష‌యం చాలా బాధించిందని అన్నారు. సున్నితమైన ఆలోచనలను, ప్రజలను ప్రభుత్వం నిరాశపరిచిందని ఆయన అన్నారు. 


'అబిడ్ విత్ మీ అనే గీతాన్ని 1847లో స్కాట్లాండ్‌కు చెందిన ఆంగ్ల కవి, గాయ‌కుడు హెన్రీ ఫ్రాన్సిస్ లైట్ రాశారు. కాగా,1950 నుండి బీటింగ్ రిట్రీట్ వేడుకలో పాడుతున్నారు. ఈ ఏడాది నుంచి బీటింగ్ రిట్రీట్ వేడుక నుంచి ఈ బీట్ ను తొలగించినట్లు భారత సైన్యం శనివారం ప్రకటించింది. ఈ ఏడాది నుంచి 1962 ఇండో-చైనా యుద్ధంలో భారత సైనికులు చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ కవి ప్రదీప్ రాసిన ప్రసిద్ధ దేశభక్తి గీతం "ఏ మేరే వతన్ కే లోగోన్ పాడ‌నున్నారు. 

 కాగా, ఈ విషయమై చిదరంబరం స్పందిస్తూ.. 'అబిడ్ విత్ మి' అనేది 1847 నాటి పాత గీతం. ఇది మహాత్మా గాంధీకి ఇష్టమైన గీతం. 1950లో మనం గణతంత్ర రాజ్యంగా మారినప్పటి నుండి, రిపబ్లిక్ డే వేడుకల చివరి రోజున బీటింగ్ ది రిట్రీట్ అనే వేడుకను నిర్వహించేవారు. గీతం వస్తుండగా బీటింగ్ రిట్రీట్‌ మార్చ్‌తో పూర్తి అవుతుంది’’ అని చిదంబరం అన్నారు.రిపబ్లిక్ డే పరేడ్‌లో పాత క్రిస్టియన్ గీతం, కేవలం క్రిస్టియన్ గీతం లాగే మిగిలిపోలేదు. ఇది సెక్యూలర్ గేయంగా అవతరించింది. కానీ ఇక నుంచి జరిగే గణతంత్ర వేడుకల్లో ఇక ఇది వినించకపోవడం బాధాకరం’’ అని అన్నారు.