ఢిల్లీ మా ఆక్సీజన్ సిలిండర్లు దొంగిలించింది.. మండిపడుతున్న హర్యానా ..
కరోనా రాష్ట్రాల మధ్య ఆక్సీజన్ చిచ్చు పెట్టేలా ఉంది. ఇప్పటికే సరిహద్దుల విషయంలో, నీటి విషయంలో రాష్ట్రాల మధ్య గొడవలు జరగడం తెలుసు. తాజాగా కరోనా పుణ్యమా అని ఆక్సీజన్ సిలిండర్లు చిచ్చు పెడుతున్నాయి.
కరోనా రాష్ట్రాల మధ్య ఆక్సీజన్ చిచ్చు పెట్టేలా ఉంది. ఇప్పటికే సరిహద్దుల విషయంలో, నీటి విషయంలో రాష్ట్రాల మధ్య గొడవలు జరగడం తెలుసు. తాజాగా కరోనా పుణ్యమా అని ఆక్సీజన్ సిలిండర్లు చిచ్చు పెడుతున్నాయి.
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులతో ప్రాణాలు కొడిగట్టిపోతున్నాయి. దీనికోసం లిక్విడ్ ఆక్సీజన్ అవసరమవుతోంది. అనేక హాస్పిటల్స్ తమ ఆసుపత్రుల్లో ఆక్సీజన్ స్టాక్ ఉండేలా చూసుకుంటున్నాయి. కాగా మధ్యప్రదేశ్ నుంచి హర్యానాకు రావాల్సిన ఆక్సీజన్ ట్యాంకర్లు, సిలిండర్లను ఢిల్లీ దోపిడీ చేసిందంటూ హర్యానా ప్రభుత్వం ఆరోపించింది.
ఈ నేపథ్యంలో మహారాష్ట్రతో సహా అనేక రాష్ట్రాలు సిలిండర్లు, గ్యాస్ ట్యాంకర్లను తీసుకెళ్లే వాహనాలకు పోలీసు రక్షణ కల్పించడం ప్రారంభించాయి.
మంగళవారం ఉదయం తమ రాష్ట్రానికి చెందిన ఆక్సీజన్ ట్యాంకర్లు ఢిల్లీ మీదుగా వస్తుంటే వాటిని దోపిడీ చేసిందంటూ.. బుధవారం హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ ఢిల్లీ ప్రభుత్వం మీద ఆరోపణలు గుప్పించారు.
హర్యానా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దీని మీద విచారణ చేపట్టాలని అనిల్ విజ్ కోరినట్లు తెలిసింది. పానిపట్ లోని ఓ ఆక్సీజన్ ప్లాంట్ నుంచి లిక్విడ్ ఆక్సిజన్ నింపిన ట్యాంకర్లు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఆక్సీజన్ ట్యాంకర్ ఫరీదాబాద్, పాల్వాల్ జిల్లాలోని హాస్పిటల్స్ కు సరఫరా అవుతున్నాయి.