Asianet News TeluguAsianet News Telugu

చైనా పేరు చెబితేనే ప్రధాని భయపడుతున్నారు: కేంద్రంపై ఒవైసీ ధ్వజం 

కేంద్ర ప్రభుత్వంపై ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా పేరు చెప్పాలంటే ప్రధాని మోడీ భయపడుతున్నారని ఒవైసీ అన్నారు.

Owasi slams Centre over India-China Tawang face-off :PM scared of taking Chinas name
Author
First Published Dec 13, 2022, 3:49 PM IST

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన వాగ్వాదం రాజకీయంగా చర్చనీయంగా మారింది. కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకపడుతున్నాయి.  డిసెంబర్ 9 న రెండు దేశాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇరు దేశాల సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి. తాజాగా ఈ ఘటనపై ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చైనా పేరు చెప్పాలంటే ప్రధాని మోదీ భయపడుతున్నారని ఒవైసీ అన్నారు. 

చైనా అంశంపై ప్రధాని మోదీని ఉద్దేశించి ఒవైసీ మాట్లాడుతూ.. '56 అంగుళాల ఛాతీ ఉన్న మన ప్రధానికి చైనా పేరు చెప్పుకోవడానికి ఎందుకు అంత భయం.. లడఖ్‌లో చైనా రెండున్నర రోజులుగా మన భూమిని ఆక్రమించుకోవడానికి కారణమేంటి? ఇన్నాళ్లుగా మోడీ నోరు మేదపడటం లేదు కదా? మన దగ్గర అంత బలమైన సైన్యం ఉందా?  మరి ఆ నాయకుడికి ఎందుకు అంత భయం?" అని విమర్శలు గుప్పించారు. సరిహద్దులో చొరబాటు లేదని ప్రధాని చెప్పడం వల్లే ఈ ఘటన జరిగిందని అన్నారు. తవాంగ్‌లో చైనా చేసిన దుస్సాహసం మన ప్రధాని , ప్రభుత్వ బలహీనతకు నిదర్శనమని అన్నారు. 

కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు

అంతకుముందు ..కాంగ్రెస్ కూడా భారత్, చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ విషయంలో ప్రభుత్వంపై విరుచుకుపడింది. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ విరుచుకుపడుతూ.. భారత సైన్యం ధైర్యసాహసాలను చూసి గర్విస్తున్నాం. సరిహద్దుల్లో చైనా చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. గత రెండేళ్లుగా ప్రభుత్వాన్ని మేల్కొల్పేందుకు పదే పదే ప్రయత్నాలు చేస్తున్నా మోడీ ప్రభుత్వం మాత్రం రాజకీయంగా పరువు కాపాడుకోవడం కోసమే ఈ విషయాన్ని అటకెక్కిస్తోందనీ, ఈ కారణంగానే చైనా ఆగడాలకు అడ్డు లేకుండా పోయిందని అన్నారు.  

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లోని యాగ్త్సే ప్రాంతంలో జరిగిన తాజా ఘర్షణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సర్వత్రా దాడిని ఎదుర్కొంటోంది. కాగా, ఈ విషయంపై భారతీయ జనతా పార్టీ నేత, హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ స్పందించారు. ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఈ వాగ్వివాదానికి సంబంధించి అనిల్ విజ్ ట్విట్టర్ ద్వారా అప్పటి జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వాన్ని అవహేళన చేస్తూ చైనాను హెచ్చరించారు. అనిల్ విజ్ ప్రధాని నరేంద్ర మోదీని సమర్థించడమే కాకుండా ప్రశంసించారు. అనిల్ విజ్ తన ట్విట్టర్‌లో ఇలా రాశారు. "చైనీస్ జాగ్రత్త, ఇది 1962లో బలహీన హృదయం ఉన్న ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ యొక్క భారతదేశం కాదు. ఇది 2022.. సింహహృదయ ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశం" అని పేర్కొన్నారు. 

అంతకుముందు కేంద్ర మంత్రి అమిత్ షా  కాంగ్రెస్‌ను టార్గెట్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌కు చైనాతో సంబంధాలున్నాయని చైనా విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తుందని అన్నారు. నెహ్రూకు చైనాపై ఉన్న ప్రేమ వల్లే భద్రతా మండలిలో భారత్‌ సభ్యత్వం రాలేదని కాంగ్రెస్‌పై షా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో (1962లో) చైనా వేల హెక్టార్ల భూమిని లాక్కుందని విమర్శించారు.

అంతటితో ఆగకుండా.. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు చైనా నుంచి డబ్బు వచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు. 2005-2007 ఆర్థిక కాలంలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనా రాయబార కార్యాలయం నుండి రూ. 1.35 కోట్ల గ్రాంట్‌ని పొందిందని, FCRA ప్రకారం ఇది సరైనది కాదని అన్నారు. కాబట్టి చట్టపరమైన ప్రక్రియను మంత్రిత్వ శాఖ హోమ్ అఫైర్స్ నమోదు చేసిందని తెలిపారు. చైనా బెదిరింపుతో సరిహద్దులోని డెమ్‌చోక్‌లో రోడ్లు, మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని కీలక వ్యాఖ్యలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios