"హవాలా వ్యాపారం చేస్తున్న కొందరు వ్యక్తులు సెక్టార్-55లో డీల్ చేయడానికి వస్తున్నారని పోలీసు స్టేషన్ సెక్టార్ 58కి సమాచారంపై వెంటనే స్పందించి.. అలెర్ట్ అవ్వడంతో ఎనిమిది మందిని అరెస్టు చేశాం" అని పోలీసులు తెలిపారు.

నోయిడా : నోయిడా సెక్టార్ 58 ప్రాంతంలో గురువారం సాయంత్రం ఒక కారులో రూ. 2 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకుని, ఎనిమిది మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ నగదు హవాలా వ్యాపారానికి సంబంధించినదిగా అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నగదు లెక్కింపు ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. 

అరెస్టు చేసిన వారిని అహ్మదాబాద్‌కు చెందిన జయంతి భాయ్, ఢిల్లీకి చెందిన సందీప్ శర్మ, ఢిల్లీకి చెందిన వినయ్ కుమార్, నార్త్ వెస్ట్ బెంగాల్‌కు చెందిన అభిజీత్ హజ్రా, నోయిడా సెక్టార్-56కి చెందిన రోహిత్ జైన్, ఢిల్లీకి చెందిన విపుల్, ముంబైకి చెందిన మినేష్ షా, ఇండోర్‌కు చెందిన అనుజ్‌లుగా గుర్తించారు.

పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్న వెంటనే, ఆదాయపు పన్ను శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు "హవాలా నెట్‌వర్క్ కోసం రూ. 2 కోట్లు తరలిస్తున్నట్లుగా భావిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారందరినీ విచారిస్తున్నట్లు" పోలీసులు తెలిపారు. సెక్టార్ 55లో హవాలా లావాదేవీలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

తమిళనాడులో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. స్కూల్స్, కాలేజ్‌లకు సెలవు..

"హవాలా వ్యాపారం చేస్తున్న కొందరు వ్యక్తులు సెక్టార్-55లో డీల్ చేయడానికి వస్తున్నారని పోలీసు స్టేషన్ సెక్టార్ 58కి సమాచారం అందింది. వీరి వద్ద చాలా నగదు ఉందని సమాచారం. నోయిడా సెక్టార్ 55లోని పోలీసు బృందం ఈ సమాచారంపై వెంటనే చర్య తీసుకుంది. వీరు అలెర్ట్ అవ్వడంతో ఎనిమిది మందిని అరెస్టు చేశారు" అని పోలీసులు తెలిపారు.

విచారణ తర్వాత ఆదాయపు పన్ను శాఖ ద్వారా రికవరీ అయిన నగదు లెక్కింపు జరుగుతుంది. "పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు, తప్పిపోయిన వ్యక్తులకు సంబంధించి దర్యాప్తు, అవసరమైన చర్యలు తీసుకోబడుతున్నాయి" అని పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ జరుపుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.