Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9 లక్షలకు పైగా ఖాళీలు.. వెల్లడించిన కేంద్ర మంత్రి

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ వారి పే రీసెర్చ్ యూనిట్ వార్షిక నివేదిక ప్రకారం.. మార్చి 1, 2021 నాటికి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాల క్రింద 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. 

Over 9 Lakh Vacancies In Central Government Departments: Minister Jitendra Singh
Author
First Published Dec 14, 2022, 3:24 PM IST

కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో దాదాపు 9.79 లక్షల ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ యొక్క పే రీసెర్చ్ యూనిట్ వార్షిక నివేదిక ప్రకారం.. మార్చి 1, 2021 నాటికి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ.. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో అవసరాలకు అనుగుణంగా ఖాళీలు ఏర్పడటం, వాటిని భర్తీ చేయడం నిరంతర ప్రక్రియగా సాగుతోందని అన్నారు.

భర్తీ చేయని పోస్టులను సకాలంలో భర్తీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖలకు/విభాగాలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న రోజ్‌గార్ మేళాలు మరింత ఉపాధి కల్పనలో ఉత్ప్రేరకంగా పనిచేస్తాయని, యువతకు వారి సాధికారత, జాతీయ అభివృద్ధిలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి అవకాశాలను అందిస్తాయని  అన్నారు.

అలాగే.. మరో ప్రశ్నకు మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ.. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)లో 1,472 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కేడర్‌లోని ఖాళీలను భర్తీ చేయడం కేంద్ర ప్రభుత్వ ప్రయత్నమని సింగ్ అన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రతి సంవత్సరం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కేటగిరీలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. 

గత ఐదేళ్లలో యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ ఉద్యోగాలు

అలాగే.. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో గత ఐదేళ్లలో 2.47 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు తెలిపారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC),స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించే రిక్రూట్‌మెంట్ పరీక్షల ద్వారా ఈ ఉద్యోగాలు అందించబడతాయి.

పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా మొత్తం 2,46,914 మంది అభ్యర్థులు రిక్రూట్ అయ్యారని తెలిపారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) గత మూడేళ్లలో నిర్వహించిన పరీక్షల ఆధారంగా 13,122 మంది అభ్యర్థులను నియామకానికి సిఫార్సు చేసింది.  

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మంత్రిత్వ శాఖలు ఇచ్చిన అవసరాల ఆధారంగా ఖాళీలను ప్రకటించడం జరుగుతుందన్నారు. కొన్ని సందర్భాల్లో చిన్నపాటి వ్యత్యాసాలు ఉండవచ్చని, పరీక్ష నోటీసులో నిర్దేశించిన నిర్దిష్ట అర్హత ప్రమాణాలకు అనుగుణంగా అభ్యర్థులు అందుబాటులో లేకపోవడం వల్ల నివేదించబడిన ఖాళీల సంఖ్య కంటే నమోదు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య కొంచెం తక్కువగా ఉండవచ్చని మంత్రి చెప్పారు.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు , సంస్థల అవసరాలకు అనుగుణంగా ఖాళీలను సృష్టించడం, భర్తీ చేయడం నిరంతర ప్రక్రియ అని మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సకాలంలో చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖలు, శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios