ఇటలీని దాటనున్న ఇండియా: మొత్తం 2,26,770కి చేరిన కరోనా కేసులు
ఇండియాలో రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 9,851 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు 273 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా 2,26,770కి కరోనా కేసులు నమోదయ్యాయి.
న్యూఢిల్లీ: ఇండియాలో రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 9,851 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు 273 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా 2,26,770కి కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు 6348 మంది మృతిచెందారు. కరోనా సోకిన రోగుల్లో 48.27 శాతం కోలుకొంటున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ప్రకటించింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో ఇండియా ఏడవస్థానంలో నిలిచింది.తొలుత అమెరికా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో బ్రెజిల్ ఉంది. మూడో స్థానంలో రష్యా నిలిచింది. ఆ తర్వాత యూకే, స్పెయిన్, ఇటలీలు నిలిచాయి.
కరోనాతో మరణించిన రోగుల సంఖ్యలో ఇండియా ప్రపంచంలో 12వ స్థానంలో నిలిచింది. కరోనా సోకిన రోగులు రికవరీ శాతంలో ప్రపంచంలో ఇండియా ఎనిమిదో స్థానంలో నిలిచింది.కరోనా కేసుల సంఖ్యలో రోజు రోజుకు ఇండియా ఎగబాకుతోంది. రేపటిలోపుగా ఇండియా ఇటలీని దాటే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మహారాష్ట్రలో గురువారం నాడు అద్యధికంగా 2,933 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 77,793కి చేరుకొన్నాయి కేసులు.ఈ రాష్ట్రంలో ఇప్పటికే 2,710 మంది మరణించారు. 33,681 మంది రోగులు ఆసుపత్రుల నుండి డిశ్చార్జీ అయ్యారు.
బెంగాల్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనాతో 283 మంది మరణించారు. రాష్ట్రంలో 6876 మందికి కరోనా సోకింది. తమిళనాడు రాష్ట్రంలో గురువారంనాడు ఒక్క రోజునే 1,384 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 27,256కి చేరుకొన్నాయి. ఇప్పటికి రాష్ట్రంలో 220 మంది చనిపోయారు.
also read:ఇండియాలో ఒక్క రోజులోనే అత్యధికంగా 9,304 కరోనా కేసులు: మొత్తం 2,16,919కి చేరిక
షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ , హోటల్స్ తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను గురువారం నాడు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు ఈ నెల 8వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని కేంద్రం తెలిపింది.
ఈ మార్గదర్శకాల మేరకు గర్భవతుల వంటి వాళ్లు జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించింది కేంద్రం.డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యం ఇవ్వాలని రెస్టారెంట్లు, హోటల్స్ మేనేమెంట్లను కేంద్రం కోరింది.